బ్రిస్బేన్‌లో జరిగిన మూడో BGT 2024 టెస్టు మ్యాచ్ తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన చమత్కారాలతో విలేకరులను తెగ నవ్వించాడు. R అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలో జరిగిన ఈ సమావేశంలో రహానే, పుజారా వంటి సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ గురించి వచ్చిన ప్రశ్నకు రోహిత్ ఉల్లాసంగా స్పందించి అందరి మనసులు గెలుచుకున్నాడు.
మొదటగా, అశ్విన్ గురించి మాట్లాడిన రోహిత్, అతను ఆటను వీడడం భారత జట్టుకు ఒక పెద్ద లోటుగా భావిస్తున్నాడు. అయితే, రానున్న సంవత్సరాలలో అశ్విన్ ప్రసార బృందంలో చేరి మళ్లీ తన అనుభవాలను పంచుకునే అవకాశం ఉందని చమత్కరించాడు.
తర్వాత, అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాళ్ల గురించి మాట్లాడినప్పుడు, రోహిత్ తన వ్యక్తిగత అనుబంధాన్ని కూడా పంచుకున్నాడు. “రహానే బొంబాయి నుండి వచ్చినవాడు, అతనితో తరచూ కలుస్తుంటాను. కానీ పుజారా రాజ్‌కోట్‌లో ఎక్కడో తలదాచుకున్నాడు, కాబట్టి అతనిని తక్కువగా కలుస్తాను,” అని రోహిత్ నవ్వుతూ చెప్పాడు.
అయితే, విలేకరి వారు ముగ్గురు ఆటగాళ్లు రిటైర్ అయినట్లుగా అభిప్రాయపడినప్పుడు, రోహిత్ వెంటనే ఆ ప్రశ్నను గ్రహించి చమత్కారంగా స్పందించాడు: “ఆప్ మేరెకో మార్వావోగే యార్! రహానే ఇంకా రిటైర్ కాలేదు. పుజారా కూడా రిటైర్ కాలేదు. అశ్విన్ మాత్రమే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు,” అంటూ మీడియా రూమ్ ని నవ్వులతో నింపాడు.
అశ్విన్ కెరీర్ గురించి మాట్లాడుతూనే రోహిత్ అతని అత్యుత్తమ ప్రదర్శనలను అభినందించాడు. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరు నిలిపిన అశ్విన్, అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టు తరపున రెండవ అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు.
ఈ విలేకరుల సమావేశం రోహిత్ చమత్కారాలతో సరదాగా మారిపోగా, అశ్విన్‌కు సంబంధించిన రిటైర్మెంట్ మాటలు ప్రతి ఒక్కరికీ గర్వాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. ఆటకు వీడ్కోలు పలికినా, అశ్విన్ తరచుగా తన నైపుణ్యాలను ప్రపంచానికి పంచుకుంటాడని రోహిత్ తన మాటలతో స్పష్టంచేశాడు.
— Lolzzz (@CricketerMasked) December 18, 2024