AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus: ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మొదటి మ్యాచ్ నవంబర్ 22 నుండి పెర్త్‌లో జరుగనుంది. విరాట్ కోహ్లీ కూడా ఉన్న ఈ సిరీస్లో ఉన్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఈ సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అయితే రోహిత్ కూడా ఈ పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు.

Ind vs Aus: ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
Rohit Sharma Training In Mumbai And Virat Kohli Started Practicing In Nets
Velpula Bharath Rao
|

Updated on: Nov 13, 2024 | 5:48 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భారత్ ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు భారత జట్టు సిద్ధమవుతుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ పెర్త్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సీరిస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత భారత ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. హిట్ మ్యాన్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇంతలో ఈ ముఖ్యమైన పర్యటనను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ కీలక నిర్ణయం

వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు, నిజానికి రోహిత్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ కారణంగా, అతను తన కుటుంబానికి సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ నుండి సెలవు తీసుకున్నాడు. అయితే ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ ముంబైలో కసరత్తు చేస్తున్నాడు. అతను రిలయన్స్ కార్పొరేట్ పార్క్ (RCP)లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. భారత్‌లో తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ కోరుకుంటున్నాడు. హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాతో జరిగే పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మ ముంబైలో సిద్ధమవుతున్నాడు, కానీ విరాట్ కోహ్లీ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం విరాట్ కోహ్లీ బుధవారం పెర్త్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. చాలా సేపు బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లికి ఈ టెస్ట్ సిరీస్ చాలా ముఖ్యమైనది. గత కొంత కాలంగా  చాలా పేలవమైన ఫామ్‌తో విరాట్ ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ కోసం విరాట్ అందరీ కన్నా ముందుగానే పెర్త్‌కు చేరుకున్నాడు.

భారత ఆటగాళ్లు ఈనెల నవంబర్ 10, నవంబర్ 11 తేదీలలో రెండు బ్యాచ్‌లుగా ముంబై నుండి పెర్త్ చేరుకున్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ మరియు వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు నవంబర్ 10న అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో పాటు బయలుదేరారు, మిగిలిన ఆటగాళ్లు మరియు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నవంబర్ 11న పెర్త్‌కు వెళ్లారు. భారత జట్టు నిన్న నవంబర్ 12న WACAలో ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే ఈ సెషన్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా పాల్గొనలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి