Team India: ఆనాడు టీమిండియాలో చోటులేదన్నారు.. నేడు అదే జట్టును చేతిలో పెట్టారు.. 10 ఏళ్ల బాధను గుర్తు చేసిన రోహిత్ శర్మ..!

Rohit Sharma-Virat Kohli: టీ20 తర్వాత వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ 2023 గెలుచుకునే బాధ్యత రోహిత్ భుజాలపై పడింది.

Team India: ఆనాడు టీమిండియాలో చోటులేదన్నారు.. నేడు అదే జట్టును చేతిలో పెట్టారు.. 10 ఏళ్ల బాధను గుర్తు చేసిన రోహిత్ శర్మ..!
Gallery Rohit Sharma Indian Captain
Follow us
Venkata Chari

|

Updated on: Dec 09, 2021 | 7:38 AM

Rohit Sharma-Virat Kohli: నీలి మేఘాలు తొలగిపోయాయి. కొన్నాళ్లుగా క్రీడాభిమానులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పరిమిత ఓవర్లకు పూర్తి కెప్టెన్‌గా రోహిత్‌ను బీసీసీఐ సారథిగా ఎంచుకుంది. టీ20 తర్వాత భారత వన్డే జట్టు కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకే అప్పగించారు. టీమిండియాను మరోసారి విశ్వవిజేతగా నిలబెట్టే బాధ్యత రోహిత్ శర్మపై ఉంది. రోహిత్ శర్మకు 2022 టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకునే టాస్క్ అందించారు. అదే సమయంలో 2023 ప్రపంచ కప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అతనికి ఛాన్స్ ఇచ్చరు. నేడు, కోట్లాది మంది క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా మారడంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆటగాడు ఒక గదిలో ఒంటరిగా కర్చుని బాధపడిన రోజులు కూడా ఉన్నాయని తెలుసా. అదే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంతో పశ్చాత్తాపపడుతున్న సమయంగా మారింది.

2011 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో యూసుఫ్ పఠాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మ ఆ విషయం ఇప్పటి వరకు గుర్తుంచుకున్నాడు. 2011 ప్రపంచకప్‌లో ఆడలేకపోయిన బాధను బహుశా ఎప్పటికీ మరచిపోలేనని రోహిత్ శర్మ ఈ రోజు కూడా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ తన ప్రదర్శన, అతని నైపుణ్యం, అతని నాయకత్వం ఆధారంగా అదే టీమిండియాకు కెప్టెన్‌గా మారాడు. 10 ఏళ్ల క్రితం ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోని రోహిత్ శర్మ.. నేడు అదే ఆటగాడికి భారత్‌ను విశ్వవిజేత చేసే బాధ్యతను అప్పగించారు.

వన్డే-టీ20 జట్టుకు రోహిత్ శర్మను ఎందుకు కెప్టెన్‌గా నియమించారు? రోహిత్ శర్మకు వన్డే, టీ20 జట్టు కమాండ్‌ అంత ఈజీగా ఏం రాలేదు. ఈ ఆటగాడు మొదట బ్యాట్‌తో తన నాయకత్వ పటిమతో యావత్ ప్రపంచాన్ని ఫిదా చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ధోనీ కెప్టెన్‌గా ఉన్న ఐపీఎల్‌లో, రోహిత్ అదే టోర్నమెంట్‌లో తన జట్టును గరిష్టంగా 5 సార్లు ఛాంపియన్‌గా చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూల్‌గా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో రోహిత్ శర్మకు తెలుసు. రోహిత్ శర్మ వ్యక్తిత్వం ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సీనియర్ అయినా, జూనియర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ప్రతి ఆటగాడు రోహిత్ శర్మకు అండగా నిలవడానికి కారణం ఇదే.

అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా.. రోహిత్ శర్మ అంతర్జాతీయ కెప్టెన్సీ కూడా అద్భుతం. రోహిత్ శర్మ టీమ్ ఇండియా తరఫున 10 వన్డేల్లో 8 మ్యాచ్‌లు గెలిపించాడు. రోహిత్ విజయాలు 80 శాతంగా ఉన్నాయి. టీ20లో రోహిత్ 22 మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించి, 18 గెలిచాడు. ఇందులో విజయ శాతం 81.82గా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఆసియా కప్‌ను కూడా కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ వన్డే, టీ20 కెప్టెన్‌గా మారాడు. కానీ అతనిలో ఎల్లప్పుడూ ఓ కెప్టెన్‌ ఉంటాడు. ప్రస్తుతం టీమిండియాను విశ్వవిజేతగా నిలబెడతాడని అంతా భావిస్తున్నారు.

Also Read: Virat Kohli: ముగిసిన కోహ్లీ వన్డే కెప్టెన్సీ శకం.. 4 ఏళ్ల జర్నీ ఎలా ఉందంటే..!

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కోహ్లీకి ఇష్టంలేదా.. బీసీసీఐ 48 గంటల సమయం ఎందుకిచ్చింది.. సారథి మార్పులో అసలేం జరిగిందంటే?

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..