AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ముగిసిన కోహ్లీ వన్డే కెప్టెన్సీ శకం.. 4 ఏళ్ల జర్నీ ఎలా ఉందంటే..!

Rohit Sharma-Virat Kohli: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో బాధ్యతలు తీసుకున్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్, 2023 ప్రపంచ కప్‌కు ముందు BCCI పెద్ద నిర్ణయం తీసుకుంది.

Virat Kohli: ముగిసిన కోహ్లీ వన్డే కెప్టెన్సీ శకం.. 4 ఏళ్ల జర్నీ ఎలా ఉందంటే..!
Virat Rohit
Venkata Chari
|

Updated on: Dec 09, 2021 | 7:20 AM

Share

Rohit Sharma-Virat Kohli: నాలుగు సంవత్సరాల క్రితం 2017 సంవత్సరంలో ఎంఎస్ ధోని తరువాత విరాట్ కోహ్లీ వన్డే జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్ అయిన వెంటనే విరాట్ కోహ్లీ అద్భుతాలు చేసి టీమిండియాను వేరే లెవల్లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు విరాట్ ప్రయాణం ముగిసింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా టీ20 తర్వాత వన్డే కెప్టెన్‌గా ఉండడం లేదు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. గత నాలుగేళ్లలో కింగ్ కోహ్లీ ఏం సాధించాడో ఓ సారి చూద్దాం.

విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ రికార్డు అద్భుతమైనది. విరాట్ కోహ్లి సారథ్యంలో 95 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 65 మ్యాచ్‌లు గెలవగా, కేవలం 27 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ 68 శాతం విజయాలు సాధించడం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం. విజయాల శాతంలో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ 77.71 శాతం మ్యాచ్‌లు గెలుపొందగా, రికీ పాంటింగ్ 76.14 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. హాన్సీ క్రోంజే 73.70 మ్యాచ్‌లు గెలిచాడు.

విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 గెలిచింది. కేవలం 4 మాత్రమే ఓడిపోయింది. విరాట్ కోహ్లీ సొంతగడ్డపై 9 ద్వైపాక్షిక సిరీస్‌లలో 8 గెలిచాడు. వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై కూడా భారత్‌కు విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాలో భారత్‌ను 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై టీమిండియా 5-1తో విజయం సాధించింది. వెస్టిండీస్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా భారత్ 3-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్, శ్రీలంక, జింబాబ్వేలో జరిగిన వన్డే సిరీస్‌లను కూడా టీమిండియా కైవసం చేసుకుంది.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వన్డే రికార్డు కూడా అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో సహా 72.65 సగటుతో 5449 పరుగులు చేశాడు. వన్డే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్ 22 వన్డే సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

Also Read: వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కోహ్లీకి ఇష్టంలేదా.. బీసీసీఐ 48 గంటల సమయం ఎందుకిచ్చింది.. సారథి మార్పులో అసలేం జరిగిందంటే?

Rohit Sharma: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‎గా రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్ట్ జట్టు ఎంపిక..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!