IPL 2023: ఏంది సామీ ఈ ఆట.. 8 మ్యాచ్‌లు, 184 పరుగులు.. జీతం మాత్రం రూ. 16 కోట్లు.. గేర్ మార్చకుంటే టాప్ 4 కష్టమే..
PBKS vs MI: ఐపీఎల్ 2023 ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సవాళ్లు పెరిగిపోయాయి. ఈ లీగ్ ప్రయాణం సగం తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై కూడా దృష్టి నెలకొంది. తడబడి కోలుకున్న ఈ జట్టు చరిత్రే ఇందుకు కారణంగా నిలిచింది.
ఐపీఎల్ 2023 ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సవాళ్లు పెరిగిపోయాయి. ఈ లీగ్ ప్రయాణం సగం తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై కూడా దృష్టి నెలకొంది. తడబడి కోలుకున్న ఈ జట్టు చరిత్రే ఇందుకు కారణంగా నిలిచింది. ఈ సీజన్‌లోనూ అదే కనిపిస్తోంది. ఒక్కరు తప్ప.. ఈ జట్టు అంతా బాగానే ఉంది. ఆయనేవరో కాదు.. ముంబై సారథి రోహిత్ శర్మ.
ముంబై కెప్టెన్ తన బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన గురించే ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లీగ్‌లో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాటింగ్‌లో అతని పరుగులు చేయడంలో ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. IPL 2023 టాప్ రన్నర్‌లతో అతనిని పోల్చడం మర్చిపోవాల్సి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తన జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌ల కంటే కూడా తక్కువ పరుగులు చేశాడు. రోహిత్ జట్టుకు ఓపెనర్‌గా వచ్చినా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమవుతున్నాడు.
8 ఇన్నింగ్స్‌ల్లో 184 పరుగులు..
IPL 2023లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఈ 8 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ రిపోర్ట్ కార్డ్ చూస్తే చాలా పేలవంగ మారింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ 8 ఇన్నింగ్స్‌ల్లో 184 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 133 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో బ్యాటింగ్ సగటు 23గా ఉంది. ఈ 8 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ బ్యాట్ నుంచి కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది.
ముంబై తరపున 5వ ప్లేయర్..
ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ 5వ స్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ అత్యధికంగా 248 పరుగులు చేశాడు. అతనికి తోడు కామెరాన్ గ్రీన్ 243 పరుగులు, ఇషాన్ కిషన్ 211 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 201 పరుగులు చేశారు.
పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న ముంబై..
రోహిత్ తన కెప్టెన్సీతోపాటు, బ్యాటింగ్‌పైనా ఫోకస్ పెంచాలి. ఎందుకంటే, 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇక ఇక్కడి నుంచి ప్లేఆఫ్స్ ఆడాలంటే మాత్రం రోహిత్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంటుంది. మంచి ఆరంభాన్ని ఇస్తే, జట్టు గెలుస్తుందని అంచనాలు పెరుగుతాయి.
ముంబై ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఈ విజయాలకు కారణం ముంబై టీంలోని ఇతర ఆటగాళ్లు. రోహిత్ మాతరం డగౌట్‌లో కూర్చుని క్లాప్స్ కొడుతున్నాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ చప్పట్లు కొట్టే సమయం గడిచిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇక బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తేనే.. ముంబై టాప్ 4లో నిలుస్తుంది. లేదంటే గతేడాదిలానే మరోసారి నిరాశ తప్పదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..