Sachin Tendulkar: మంచి మనసు చాటుకున్న మాస్టర్ బ్లాస్టర్.. 2,300 మంది పేద పిల్లల కోసం సచిన్ ఏం చేశాడో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్లో లెక్కలేనన్నీ రికార్డులు, అద్భుతాలు సృష్టించిన సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సచిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం కోరిన వారికి తన వంతు చేయూతనిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్.
సచిన్ టెండూల్కర్.. పరిచయం అవసరం లేని పేరు. భారత క్రికెట్‌లో ఆయన సాధించిన రికార్డులకు కొదవే లేదు. అంతకుమంచి ఆయన క్రమశిక్షణ, ఆట పట్ల అంకిత భావం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. అందుకే యావత్ ప్రపంచం సచిన్‌ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో లెక్కలేనన్నీ రికార్డులు, అద్భుతాలు సృష్టించిన సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సచిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం కోరిన వారికి తన వంతు చేయూతనిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సచిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్మిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సందల్పూర్లో ఈ స్కూలును నిర్మిస్తున్నారు.ఈ పాఠశాల ద్వారా రాబోయే దశాబ్ద కాలంలో 2,300 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని సచిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా ఈ పాఠశాలను తన తండ్రి రమేశ్ టెండూల్కర్, తల్లి రజినీ టెండూల్కర్‌లకు సచిన్ అంకితం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు సచిన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సంకల్పం సక్సెస్ కావాలంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక క్రికెట్ పరంగా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో ఆయన తనయుడ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లేయర్‌గా సేవలందిస్తున్నాడు.
Sachin Tendulkar foundation will build a school in Sandalpur that will provide free education for 2300 children over the next decade as a tribute for his father who was a professor.
Great gesture from God of Cricket. pic.twitter.com/uVjUL9uiEH
— Johns. (@CricCrazyJohns) May 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..