AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: వారిద్దరూ ఇంకొద్ది సేపు క్రీజులో ఉంటే బాగుండేది.. ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పరాజయంపై రోహిత్‌

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరో సారి కప్‌ను ఎగరేసుకుపోయింది ఆసీస్. హెడ్ 137 పరుగులతో విజృంభించడంతో 43 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ మరో బ్యాటర్ లబుషేన్‌ 58 నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ICC World Cup 2023: వారిద్దరూ ఇంకొద్ది సేపు క్రీజులో ఉంటే బాగుండేది.. ప్రపంచ కప్‌ ఫైనల్‌లో పరాజయంపై రోహిత్‌
India Vs Australia
Basha Shek
|

Updated on: Nov 20, 2023 | 8:29 AM

Share

140 కోట్ల భారతీయుల ఆశ నిరాశైంది. ప్రపంచకప్‌ చరిత్రలో వరుసగా పది మ్యాచ్‌ల్లో తిరుగులేని ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్‌ కు చేరిన భారత్ తుది పోరులో అభిమానులను నిరాశ పరిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మనకంటే ఘోరంగా కేవలం 47 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకున్నా..ఆసీస్‌ బ్యాటర్లు కంగారు పడలేదు. హెడ్‌, లబుషేన్‌ ఏకంగా నాలుగో వికెట్‌కు 192 పరుగులు చేసి పిచ్‌పై బ్యాటింగ్‌ కష్టం కాదని నిరూపించారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరో సారి కప్‌ను ఎగరేసుకుపోయింది ఆసీస్. హెడ్ 137 పరుగులతో విజృంభించడంతో 43 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ మరో బ్యాటర్ లబుషేన్‌ 58 నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొదట టాస్‌ ఓడిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటయ్యింది. కోహ్లీ 54, కేఎల్‌ రాహుల్‌ 66, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 47 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ , రవీంద్ర జడేజా , సూర్యకుమార్‌ తీవ్ర నిరాశ పరిచారు. ఇప్పటివరకు భారత్ నాలుగుసార్లు ఫైనల్‌ చేరగా.. రెండుసార్లు 1983, 2011 లో కప్ గెలిచింది. 2003, 2023లో ఇదే ఆసీస్ చేతిలోనే ఓడిపోయి రన్నర్‌గా నలిచింది. ఆసీస్ ఇప్పటివరకు 1987, 1999, 2003, 2007, 2015, 2023లో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్‌లో విఫలమకావడంతో ఓటమి పాలైమని రోహిత్‌ తెలిపాడు.స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. టార్గెట్‌ను డిఫెండ్‌ చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాం. కానీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాన్నాడు. మరో 20-30 పరుగులు చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. టాస్ ఓడిపోవడం మొదటి కారణమైతే.. బ్యాటర్లు రాణించకపోవడం, వికెట్‌ను ఆపే క్రమంలో కోహ్లీ, రాహుల్ నెమ్మదిగా ఆడడం, స్పిన్నర్లు తేలిపోవడం ఇది భారత్‌ను కొంపముంచాయి. ఓటమితో సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో మిగతా ప్లేయర్స్ ఓదార్చారు. కంట్రోల్ చేసుకోలేక విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. టీమిండియా ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తలకూడా పైకెత్తకుండా కనీళ్లు తుడుచుకున్నారు. ఈ వరల్డ్ కప్ మెగాటోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి, 765 పరుగులతో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్‌తో పురస్కరించారు.

మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..