
Champions Trophy Opening Ceremony Cancelled: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి చాలా రోజుల సమయం లేదు. ఈ మెగా ఈవెంట్‌లో 8 టీమ్‌లు పాల్గొనబోతున్నాయి. దీని ప్రారంభం గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో, Jio TV నుంచి ఒక కీలక వార్త వచ్చింది. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ప్రారంభ వేడుక నిర్వహించడం లేదని తెలుస్తోంది.
ఫిబ్రవరి 16న లాహోర్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ, పీసీబీ సంయుక్తంగా ఓపెనింగ్ వేడుకను నిర్వహించాలని యోచిస్తున్నాయని, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ కూడా దీనికి ఆమోదం తెలిపారని కొన్ని మీడియా నివేదికలలో వినిపిస్తోంది.
ఓపెనింగ్ వేడుకతో పాటు ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్ కూడా రద్దు చేశారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తమ బిజీ షెడ్యూల్‌ల కారణంగా టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ చేరుకోవడానికి నిరాకరించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జట్ల కెప్టెన్ల కోసం విలేకరుల సమావేశం కూడా ఉండదంట.
ఈ ఈవెంట్‌ల రద్దుతో భారత అభిమానులు కొంత వరకు సంతోషిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఈవెంట్‌లలో పాల్గొనడానికి రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళవలసిందిగా ఒత్తిడి ముగిసింది. అంతకుముందు కూడా పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 18న లాహోర్ చేరుకుంటుందని ఈ నివేదికలో పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్, భారత్ జట్టు ఫిబ్రవరి 15 న దుబాయ్ చేరుకోనుండగా, ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 12 న ఇస్లామాబాద్ చేరుకుంటుంది.
🚨 NO OPENING CEREMONY & CAPTAINS PHOTOSHOOT FOR CT 🚨
– Captain Rohit Sharma won’t travel to Pakistan as the ICC cancelled the opening ceremony & Captains’ photoshoot for Champions Trophy. (Cricbuzz). pic.twitter.com/tfpU7yZD79
— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025
అదే సమయంలో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు మిగిలిన జట్ల కంటే ముందే పాకిస్తాన్‌కు చేరుకుంటాయి. ఎందుకంటే, ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు లాహోర్, కరాచీలలో ముక్కోణపు ODI సిరీస్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నిర్ణయించుకున్నాయి. రెండు జట్లు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉందని, ఫిబ్రవరి 12న జరిగే వన్డే మ్యాచ్ తర్వాత దాని పర్యటన ముగుస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..