Rohit Sharma: ప్రపంచకప్ గెలిచిన తర్వాత పిచ్‌పై మట్టిని తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా? వీడియో

|

Jun 30, 2024 | 3:40 PM

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయం తర్వాత భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కన్నీళ్లతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న అతను కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలోని పిచ్‌ పై తన మమకారాన్ని చాటుకున్నాడు

Rohit Sharma: ప్రపంచకప్ గెలిచిన తర్వాత పిచ్‌పై మట్టిని తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా? వీడియో
Rohit Sharma
Follow us on

టీమిండియా అతిపెద్ద కల నెరవేరింది. 2013 నుంచి భారత జట్టుకు అందని ద్రాక్షలా మారిన ఐసీసీ ట్రోఫీ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ రూపంలో మళ్లీ వచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ గా కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా సాధించాలని కలలు కన్న రోహిత్ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయం తర్వాత భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కన్నీళ్లతో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న అతను కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలోని పిచ్‌ పై తన మమకారాన్ని చాటుకున్నాడు. ఇందులో భాగంగా పిచ్‌పై ఇసుకను తిన్నాడు రోహిత్. రెండు సార్లు చాలా తక్కువ మోతాదులో చేతితో మట్టి తీసి నోట్లో వేసుకున్నాడు. తోటి ఆటగాళ్లు, ఇతర సిబ్బంది సంతోషంతో ఈలలు, కేకలు వేస్తున్న వేళ రోహిత్ ఈ విధంగా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ చారిత్రక విజయం ఎప్పటికీ గుర్తిండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ విజయం తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘టీ20 ఫార్మాట్‌తో కెరీర్‌ ప్రారంభించాను. ఇప్పుడు ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. ఈ విజయంతో టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. కపిల్ దేవ్ తొలిసారిగా 1983లో ఈ ఫీట్ సాధించగా, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007, 2011లో ప్రపంచకప్ గెలిచింది. ఇప్పుడు, 2024లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా, ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

గతంలో టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కూడా..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..