Virat vs Rohit: ముదిరిన కెప్టెన్సీ వివాదం.. బీసీసీఐపై అలిగిన విరాట్ కోహ్లీ.. రోహిత్‌తో కలిసి బరిలోకి దిగేది ఇక కష్టమేనా?
India vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఆడరు. ఇది యాదృచ్చికమో, కెప్టెన్సీ వివాదమో కానీ.. ఇద్దరు ఆటగాళ్లు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తారు. కానీ.. టెస్టులు, వన్డేల్లో మాత్రం కలిసి బరిలోకి దిగరనేది వాస్తవం.
Virat Kohli vs Rohit Sharma: 2021 చివర్లో టీమిండియాలో వివాదాలు చుట్టుముట్టుకునేలా ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్2021 కు ముందే విరాట్ కోహ్లీ, పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత టీ20కి రోహిల్ శర్మను సారథిగా బీసీసీఐ నియమించింది. అలాగే స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడలేదు. అలాగే తరువాత జరిగిన టెస్ట్ సిరీస్‌కు విరాట్ సారథిగా వ్యవరించగా, రోహిత్ శర్మ భాగం కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ తరువాత దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్ సిద్ధమైంది. ఈ దశలో టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, వన్డే ఫార్మాట్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేస్తూ ఆశ్చర్యపరిచింది. దీంతో కెప్టెన్సీ వివాదానికి ఇక్కడే బీసీసీఐ ఆజ్యం పోషించిందని నెటిజన్లతోపాటు మాజీలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇది కాస్త దక్షిణాఫ్రికా సిరీస్‌లో వన్డేల నుంచి విరాట్ కోహ్లీ, టెస్టుల నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ బీసీసీఐకు మరింగతగా షాక్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ముందుగా మూడు టెస్టుల సిరీస్, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. గాయం కారణంగా రోహిత్ టెస్టుకు దూరమయ్యాడు. మీడియా కథనాల ప్రకారం, విరాట్ వన్డేల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విరాట్ నుంచి వన్డేలకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి రోహిత్‌ను టీమిండియా కెప్టెన్‌గా నియమించారు. అప్పటి నుంచి కెప్టెన్సీ గల్లంతు కావడం పట్ల విరాట్ సంతోషంగా లేడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐపై విరాట్ చాలా కోపంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
భారత జట్టు డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి జరగనుంది. టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 19 నుంచి వన్డే సిరీస్ జరగనుంది. టెస్టు జట్టును ప్రకటించగా, వన్డే జట్టును ఇంకా ప్రకటించలేదు. కాగా, సోమవారం ముంబైలో ప్రాక్టీస్‌లో రోహిత్ గాయపడ్డాడు. అతడి చేతికి గాయమైంది. అయితే వన్డే సిరీస్ వరకు అతను ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. టెస్టు సిరీస్ నుంచి రోహిత్ నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ అతని స్థానంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ ప్రియాంక్ పంచాల్‌ను చేర్చింది.
వన్డేలకు విరాట్ అందుబాటుపై డౌట్? వన్డేలకు విరాట్‌కు బదులుగా రోహిత్‌కు కెప్టెన్సీని అప్పగించారు. టెస్టు సిరీస్ తర్వాత జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మీడియా కథనాల ప్రకారం, విరాట్ కోహ్లీ తన కుమార్తె వామిక మొదటి పుట్టినరోజున తన కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాడు. జనవరి 11న ఆయన కూతురు పుట్టినరోజు. అదే సమయంలో మూడో టెస్టు కూడా జనవరి 11 నుంచి 15 వరకు జరగనుంది. నివేదిక ప్రకారం, కోహ్లి మూడో టెస్టు తర్వాత తన కుటుంబంతో కలిసి హాలిడే జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.