Indian Cricket Team: వైస్ కెప్టెన్ ఎవరు.. టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత బీసీసీఐ ప్లాన్ ఏంటి?
IND vs SA: డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న తరువాత, ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఎవరుండనున్నారో చూడాలి.
IND vs SA: దక్షిణాఫ్రికా టూర్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ప్రస్తుతం ఓ ప్రశ్న సర్వత్రా ఆసక్తి రేకిత్తిస్తోంది. జట్టు వైస్ కెప్టెన్సీ గురించి బీసీసీఐ ఏం చేయనుందో చూడాలి. నిజానికి, ఈ పర్యటన కోసం, రోహిత్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అజింక్యా రహానే స్థానంలో రోహిత్‌కు ఈ పదవి లభించింది. రహానే చాలా కాలం పాటు భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత కొన్ని నెలలుగా అతని పేలవమైన ప్రదర్శన కారణంగా, అతని నుంచి ఈ స్థానం తీసుకున్నారు. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. కానీ, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మ గాయం బారిన పడడంతో వైస్ కెప్టెన్సీ కథ మళ్లీ మొదటికి చేరింది.
ఇప్పుడు వైస్ కెప్టెన్సీలో రోహిత్ తరువాత ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి. డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందే వైస్ కెప్టెన్ పేరును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రశ్న వైస్ కెప్టెన్ ఎవరు? మళ్లీ రహానే కాగలడా? లేక న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఛెతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్ చూస్తారా? ఈ రేసులో కేఎల్ రాహుల్ సహా మరికొందరి పేర్లను కూడా పరిశీలించవచ్చు.
అజింక్య రహానే.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రహానె వైస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. కానీ, ప్రస్తుతం రోహిత్ జట్టులో భాగం కానందున, అతని పేరును మేనేజ్‌మెంట్ పునరాలోచించవచ్చు. మిగతా ఆటగాళ్ల కంటే వైస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా అతనికి ఉంది. రహానే వైస్ కెప్టెన్‌గా మారితే, అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా ఆడతాడు. ఇటీవలి కాలంలో రహానె చాలా పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నాడు. అయితే నాణేనికి మరో వైపు ఉన్నట్లే.. దక్షిణాఫ్రికాలో రహానే అద్భుతంగా రాణించాడు. ఇక్కడ ఆడిన 3 టెస్టుల్లో, అతని బ్యాటింగ్ సగటు 52 కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 266 పరుగులు చేశాడు. ఈ సమయంలో 96 పరుగులు అతని అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. అంటే రహానెని వైస్ కెప్టెన్‌గా చేసి రిస్క్ తీసుకుంటారా లేదో చూడాలి. ఏది ఏమైనా టెస్టు కెరీర్ పరంగా రహానేకి ఈ టూర్ డూ ఆర్ డై అనే చెప్పాలి.
ఛెతేశ్వర్ పుజారా.. పుజారా భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, అయితే ఇటీవలి కాలంలో అతని ఫామ్ కూడా క్షీణించింది. అతను చాలా కాలంగా టెస్టుల్లో సెంచరీ చేయలేదు. అయితే, మేనేజ్‌మెంట్ రహానెపై విశ్వాసం ఉంచకపోతే, పుజరా ఇప్పటికీ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా మారవచ్చు. ఇటీవల, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా పుజారా వైస్ కెప్టెన్‌గా కనిపించాడు.
కేఎల్ రాహుల్.. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌లో భాగం కాకపోతే, ఓపెనింగ్ బాధ్యతను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ నిర్వహించడం స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి ప రిస్థితుల్లో ఏదైనా కొత్త గా చేయాలన్న ఉద్దేశంతో మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్ పదవి అప్పగించవచ్చు. కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి కొంచెం కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. ఈ విషయాలు అతనికి అనుకూలంగా జరుగుతున్నట్లు చూడవచ్చు.
అశ్విన్ లేదా బుమ్రా.. బ్యాట్స్‌మెన్‌ను చూడకపోతే, జట్టు మేనేజ్‌మెంట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతను బౌలర్‌కు అప్పగించాలనుకుంటే, అశ్విన్, బుమ్రా మంచి ఎంపికలు కావచ్చు. విశేషమేమిటంటే వీరిద్దరూ టెస్టు జట్టులో సాధారణ సభ్యులే. అలాగే, ఇద్దరు ఆటగాళ్లు కూడా బంతితో ఫామ్‌లో ఉన్నారు. ఇది వారికి ప్రయోజనం చేకూరుస్తుందేమో చూడాలి.