టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లీ దూరం.. వైట్ బాల్ కెప్టెన్సీ వివాదమే కారణమా? అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..!

IND vs SA: వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కెప్టెన్సీలో ఆడడం తనకు చాలా ఇష్టం అని రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే విరాట్ కూడా రోహిత్ కెప్టెన్సీలో ఆడాలనుకుంటున్నాడా? లేదా తెలియదు.

టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లీ దూరం.. వైట్ బాల్ కెప్టెన్సీ వివాదమే కారణమా? అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..!
Rohit Sharma and Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Dec 14, 2021 | 9:57 AM

Rohit Sharma, Virat Kohli: వైట్ బాల్ క్రికెట్‌లో విరాట్ కెప్టెన్సీలో ఆడటం తనకు బాగా నచ్చిందని టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కూడా అతని కెప్టెన్సీలో ఆడాలనుకుంటున్నాడా? లేదా అనేది తెలియదు. దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు తలెత్తిన పరిస్థితి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదట రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన తర్వాత విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడడని కూడా వార్తలు వస్తున్నాయి. వన్డే సిరీస్ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడు.

టెస్టు సిరీస్‌ నుంచి రోహిత్‌, వన్డే సిరీస్‌ నుంచి విరాట్‌ వైదొలగడానికి కారణం కూడా ఉంది. రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో, అతని ఎడమ స్నాయువులో గాయం ఉందని, దాని కారణంగా అతను 3-టెస్టుల సిరీస్‌లో భాగం కాలేడని పేర్కొంది. అదే సమయంలో, విరాట్ వన్డే సిరీస్ నుంచి వైదొలగడానికి కారణం స్పష్టంగా తెలియలేదు. అయితే బిజీ లైఫ్‌కు కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. నిజానికి, 3 వన్డేల సిరీస్ ఆడాల్సిన సమయంలో, కోహ్లీ కుమార్తె వామిక మొదటి పుట్టినరోజు కూడా ఉంది. నివేదిక ప్రకారం, విరాట్ బీసీసీఐకి అదే కారణాన్ని వివరిస్తూ సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.

వైట్ బాల్ కెప్టెన్సీపై వివాదం.. అయితే వన్డే, టెస్టు సిరీస్‌ల నుంచి వైదొలగడం వెనుక విరాట్‌, రోహిత్‌ల మధ్య వైట్‌బాల్‌ కెప్టెన్సీ వివాదం ఉందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీనిపై ఊహాగానాలు సాగుతున్నాయి. నిజానికి విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకునే మూడ్‌లో లేడు. అయితే గత వారం బీసీసీఐ అతడిని తొలగించి రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా చేసింది. అయితే దీనిపై కోహ్లీ స్పందించలేదు. మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. టెస్టు కెప్టెన్ కోహ్లి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కానీ, అక్కడ కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ, విరాట్‌ సన్నిహిత వర్గాల మేరకు ఈ నిర్ణయంతో అతను ఖచ్చితంగా షాక్ అయ్యాడని తెలుస్తోంది.

Also Read: IND vs SA: ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో రికార్డుల రారాజు.. 100 మ్యాచుల్లో 24 సెంచరీలు, 7వేలకుపైగా పరుగులు.. రోహిత్ గాయంతో దక్కిన ఛాన్స్..!

Australia: ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. 15 మంది ఆటగాళ్ల పేర్లు ఖరారు..