IND Vs SA: నెట్స్‌లో చెమటోడ్చిన కేఎల్ రాహుల్.. వైరల్ అయిన వీడియో..
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. టెస్ట్ సిరీస్ ఎలాగైనా గెలవాలని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు...
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. టెస్ట్ సిరీస్ ఎలాగైనా గెలవాలని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో రాహుల్ ఉత్సాహంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ ఉండటంతో ఈ 29 ఏళ్ల యువకుడిపై మరింత బాధ్యత ఉంటుంది. ముంబైలో శిక్షణ సమయంలో రోహిత్ ఎడమ చేతికి గాయమైంది. రోహిత్ స్థానంలో ప్రియాంక్ పంచల్‌ను టెస్ట్ జట్టులో చేర్చారు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఎడమ తొడ కండరాలు పట్టెయడంతో రాహుల్ తప్పుకున్నాడు. అతనడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. ఆ తర్వాత రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నాడు. రాహుల్ ఇప్పటి వరకు 40 టెస్టులు ఆడాడు. 35.16 సగటుతో 2,321 పరుగులు చేశాడు. రెడ్-బాల్ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 199, అతను 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై ఈ అత్యధిక స్కోర్ చేశాడు. టీ20, వన్డేల్లో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ అయ్యాడు.
అజింక్య రహానె, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోమవారం ముంబైలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నుండి సహాయం తీసుకున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు తన అమ్మమ్మ నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అతని బెంగళూరు సహచరుడు KL రాహుల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.