Rohit Sharma Birthday: సైలెంట్‌గా హిట్‌మ్యాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. జాడలేని ముంబై కెప్టెన్.. ఫొటోస్ వైరల్

Rohit Sharma Birthday: మ్యాచ్‌కు ముందు అర్ధరాత్రి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ తన భార్య, ముంబై ఇండియన్స్ సహచరులతో కలిసి అర్థరాత్రి కేక్ కట్ చేశాడు. ఆయన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Rohit Sharma Birthday: సైలెంట్‌గా హిట్‌మ్యాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. జాడలేని ముంబై కెప్టెన్.. ఫొటోస్ వైరల్
Rohit Sharma Birthday
Image Credit source: BCCI

Updated on: Apr 30, 2024 | 11:16 AM

Rohit Sharma Birthday: భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారంతో 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అర్ధరాత్రి తన భార్య, సహచరులతో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. అతను తన పుట్టినరోజున మ్యాచ్‌కు మైదానంలోకి దిగడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు లక్నో చేరుకుంది.

మ్యాచ్‌కు ముందు అర్ధరాత్రి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ తన భార్య, ముంబై ఇండియన్స్ సహచరులతో కలిసి అర్థరాత్రి కేక్ కట్ చేశాడు. ఆయన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో అతని ముఖంలో పెద్ద చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. వైరల్ అవుతోన్న ఫొటోలో రోహిత్‌తో పాటు అతని భార్య రితికా సజ్‌దే, సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా కనిపించారు. అయితే వైరల్ ఫొటోలలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్కడా కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ముంబై నుంచి ప్రత్యేక వీడియో..


అయితే, దీనికి ముందు హార్దిక్ రోహిత్‌తో కలిసి మైదానంలో కనిపించాడు. అక్కడ అతను తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా రోహిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఇండియన్స్ కూడా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా వీడియోను పంచుకోవడం ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, 10 జట్ల ఈ లీగ్‌లో పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో ఉంది.

ముంబై జట్టు 9 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే, పాండ్యా నేతృత్వంలోని జట్టు లక్నోపై ఎలాగైనా గెలవాలి. మరోవైపు కేఎల్ రాహుల్‌కు చెందిన లక్నో ఐదో స్థానంలో ఉంది. లక్నో 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..