ఇలాంటి ఆటగాడే ఆసీస్‌కి కావాల్సింది.. జట్టులోకి తీసుకుంటే టీ20 ప్రపంచకప్ మళ్లీ కంగారూలదే.!

టీ20 ప్రపంచకప్‌‌నకు ముందుగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే, టెస్టు జట్టులో ప్రధాన ఆటగాడైన స్టీవ్ స్మిత్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించట్లేదు. ఆసీస్ సెలక్టర్లు స్మిత్‌కు మొండిచెయ్యి చూపించబోతున్నారని సమాచారం. ఈ సీజన్ ఐపీఎల్‌‌లోనూ ఆడని స్మిత్.. గత కొంతకాలంగా

ఇలాంటి ఆటగాడే ఆసీస్‌కి కావాల్సింది.. జట్టులోకి తీసుకుంటే టీ20 ప్రపంచకప్ మళ్లీ కంగారూలదే.!
Australia Cricket Team
Follow us

|

Updated on: Apr 30, 2024 | 11:26 AM

టీ20 ప్రపంచకప్‌‌నకు ముందుగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే, టెస్టు జట్టులో ప్రధాన ఆటగాడైన స్టీవ్ స్మిత్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించట్లేదు. ఆసీస్ సెలక్టర్లు స్మిత్‌కు మొండిచెయ్యి చూపించబోతున్నారని సమాచారం. ఈ సీజన్ ఐపీఎల్‌‌లోనూ ఆడని స్మిత్.. గత కొంతకాలంగా టీ20 క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడ్ని ఎంపిక చేయకపోవడానికి ఆస్ట్రేలియా సెలెక్టర్లకు ఇదొక కారణం కావచ్చు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా.. 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన ఆసీస్ జట్టును త్వరలోనే ప్రకటించనుంది. మిచెల్ మార్ష్ సారధ్యం వహించనున్న ఈ జట్టులోకి స్టీవ్ స్మిత్ స్థానంలో టీ20 యువ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను ఎంపిక చేయనున్నారట సెలెక్టర్లు. ఈ యువ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడిన 5 మ్యాచ్‌ల్లోనే తన సత్తా చాటాడు.

ఐపీఎల్ 2024లో మెక్‌గర్క్ కేవలం 5 మ్యాచ్‌లాడి 247 పరుగులు చేశాడు. అతడు 237.50 స్ట్రైక్ రేట్‌తో 3 అర్ధ సెంచరీలు బాదాడు. ఈ సమయంలో అతడి బ్యాట్‌ నుంచి 22 సిక్సర్లు వచ్చాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా అద్భుత గణాంకాలు నమోదు చేశాడు మెక్‌గర్క్.

స్టీవ్ స్మిత్ టీ20 రికార్డులివే..

స్టీవ్ స్మిత్ టీ20 గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. అతడు 67 టీ20లు ఆడి 55 ఇన్నింగ్స్‌ల్లో 1094 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 125.45గా ఉంది. స్టీవ్ స్మిత్ 55 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 5 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు మాత్రమే నమోదు చేయగలిగాడు.

Latest Articles
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..