AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: నాడు టీ20ల నుంచి తప్పించారు.. నేడు వన్డేల నుంచి బయటకు.. కట్‌చేస్తే.. ఆసియాకప్‌నకు ముందు రెస్ట్ ఇచ్చేశారు..

Asia Cup 2023: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కానీ, ఈ మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే కనిపించారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అంటే రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు చాలా కాలంగా విశ్రాంతినిచ్చారు.

Team India: నాడు టీ20ల నుంచి తప్పించారు.. నేడు వన్డేల నుంచి బయటకు.. కట్‌చేస్తే.. ఆసియాకప్‌నకు ముందు రెస్ట్ ఇచ్చేశారు..
Rohit Sharma Virat Kohli
Venkata Chari
|

Updated on: Aug 04, 2023 | 5:20 AM

Share

Rohit Sharma-Virat Kohli: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కానీ, ఈ మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే కనిపించారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అంటే రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు చాలా కాలంగా విశ్రాంతినిచ్చారు.

దీని తర్వాత కింగ్ కోహ్లి, హిట్‌మాన్ మళ్లీ ఎప్పుడు పోటీలోకి వస్తారనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు బీసీసీఐ సమాధానం ఆగస్టు 24న.. అంటే ఆసియాకప్‌నకు ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో భారత జట్టు కోసం 5 రోజుల ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించనున్నారు. అప్పటి వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌పై పోరుతో రంగంలోకి..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగడం విశేషం. అంటే ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న ఆడనుంది. శ్రీలంకలోని క్యాండీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని ప్రకారం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల తదుపరి టార్గెట్‌ పాకిస్థాన్.

తొలి టీ20ఐలో టీమిండియా పరాజయం..

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగింది. అయితే, హార్దిక్ సేన నాయకత్వంలో తొలి టీ20ఐలో పరాజయం పాలైంది.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

ఆసియా కప్ షెడ్యూల్..

ఆగస్టు 30- పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)

ఆగస్టు 31- బంగ్లాదేశ్ vs శ్రీలంక (కాండీ)

సెప్టెంబరు 2- భారత్ vs పాకిస్థాన్ (కాండీ)

సెప్టెంబర్ 3- బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సెప్టెంబర్ 4- భారత్ vs నేపాల్ (కాండీ)

సెప్టెంబర్ 5- శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సూపర్-4 దశ షెడ్యూల్..

సెప్టెంబర్ 6- A1 Vs B2 (లాహోర్)

సెప్టెంబర్ 9- B1 Vs B2 (కొలంబో)

సెప్టెంబర్ 10- A1 Vs A2 (కొలంబో)

సెప్టెంబర్ 12- A2 Vs B1 (కొలంబో)

సెప్టెంబర్ 14- A1 Vs B1 (కొలంబో)

సెప్టెంబర్ 15- A2 Vs B2 (కొలంబో)

సెప్టెంబర్ 17- ఫైనల్ (కొలంబో)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు