RR Vs LSG: ఆ పిచ్చోళ్లకు అర్ధంకాలే.! డమ్మీని అట్టిపెట్టుకుని డైనోసార్‌ను వదిలేశారు.. ఎవరంటే.?
మెగా వేలానికి ముందు పలు ఫ్రాంచైజీలు తీసుకునే కొన్ని నిర్ణయాలు.. ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. సరిగ్గా ఇలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతోంది. మరి అదేంటి.? ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ ఏదైనా కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ జట్టును రూపుదిద్దుకుంటుంది. ఆ క్రమంలోనే మెగా వేలంలోకి వెళ్తుంది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్టులో చేసే పలు తప్పిదాలే.. ఆ తర్వాత జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ఒకటే రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. గతేడాది రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో లీగ్ స్టేజి ముగించింది. ఆ సమయంలో ఈ జట్టుకు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు జోస్ బట్లర్. ఇక ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేశాడు షిమ్రోన్ హెట్‌మెయిర్..
ముందు సీజన్ల వరకు జోస్ ది బాస్ అన్నట్టుగా పరుగుల వరద పారించాడు బట్లర్. అయితే ఐపీఎల్ 2024లో మాత్రం మనోడి ఫామ్ కొంచెం తగ్గింది. ఆడిన 11 మ్యాచ్‌లలో రెండు సెంచరీలతో 359 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 107 పరుగులు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్, భారత్ టీ20 సిరీస్ జరగడం.. అందులో బట్లర్ ఫ్లాప్ షో చేయడం.. వెనువెంటనే రిటెన్షన్ అనౌన్స్‌మెంట్ రావడం జరిగింది. సో అప్పటిదాకా ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టిన బట్లర్‌కు మొండిచెయ్యి చూపించింది రాజస్తాన్ రాయల్స్. ఫినిషర్ స్థానానికి గానూ షిమ్రోన్ హెట్‌మెయిర్‌కు రూ. 11 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. బట్లర్‌ను వేలంలో వదిలేసింది. పోని రైట్ టూ కార్డు అయినా తీసుకుంటుందా అంటే తీసుకోలేదు. సీన్ కట్ చేస్తే..! గుజరాత్ టైటాన్స్ బట్లర్‌ను రూ. 15 .75 కోట్లకు కొనుగోలు చేసింది.
స్థానం మారింది. వన్ డౌన్ దిగాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు మినహా.. మిగిలినవాటిల్లో 54, 39, 73, 0, 36, 16, 97.. దుమ్మురేపే స్కోర్లు చేశాడు. గుజరాత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఇక ఇటు షిమ్రోన్ హెట్‌మెయిర్.. గత రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్‌లో చేయాల్సిన 9 పరుగులు చేయలేక.. రాజస్థాన్‌కు ఓటములు ఇవ్వడమే కాదు.. ఫినిషర్‌గా అట్టర్ ప్లాప్ అయ్యాడు. కచ్చితంగా రాజస్థాన్ ఫ్రాంచైజీ.. తాము తీసుకున్న ఈ ఒక్క డిసిషన్ పట్ల ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నట్టు ఉందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా.. జోస్ ది బాస్ మాత్రం.. స్థానం ఏదైనా తాను టీ20 కింగ్ అని మరోసారి నిరూపించుకుంటున్నాడు. Form is Temporary.. Class is Permanent అని సత్తా చాటాడు. అలాగే మాజీ క్రికెటర్లు సైతం జోస్ బట్లర్‌ను రిలీజ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
Ye hai hukum ka ikka – 𝐉𝐎𝐒! 😎 pic.twitter.com/QIl60grrik
— Gujarat Titans (@gujarat_titans) April 20, 2025




