Watch Video: రిటైర్మెంట్ చేసి చాన్నాళ్లైనా.. ఏమాత్రం జోరు తగ్గలే.. భారీ షాట్లతో రెచ్చిపోయిన లిటిల్ మాస్టర్..

సురేశ్ రైనా ఇటీవలే అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. పదవీ విరమణ చేసిన 4 రోజుల తర్వాత, అంటే శనివారం, అతను తిరిగి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

Watch Video: రిటైర్మెంట్ చేసి చాన్నాళ్లైనా.. ఏమాత్రం జోరు తగ్గలే.. భారీ షాట్లతో రెచ్చిపోయిన లిటిల్ మాస్టర్..
Sachin
Follow us
Venkata Chari

|

Updated on: Sep 10, 2022 | 5:15 PM

భారత మాజీ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని భారత లెజెండ్ శనివారం కాన్పూర్‌లో జరిగే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో జాంటీ రోడ్స్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా లెజెండ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సచిన్.. ప్రాక్టీస్ లో ఇరగదీశాడు. లాంగ్ షాట్ లతో తనలో ఇంకా సత్తా తగ్గలేదని చూపించాడు. ఈ క్రమంలో ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. దీనిని చూసిన నెటిజన్లు కూడా కామెంట్లతో లెజెండ్ ఈజ్ బ్యాక్ అంటూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇటీవల , సురేశ్ రైనా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన 4 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రంగంలోకి దిగేందుకు పూర్తిగా సిద్ధ‌మ‌య్యాడు. రైనాతో పాటు గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈరోజు మళ్లీ మైదానంలోకి రానున్నారు.

ఇవి కూడా చదవండి

8 జట్ల మధ్య పోటీ..

ఈ 8 జట్ల టోర్నమెంట్ సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్, ఇండోర్, డెహ్రాడూన్, రాయ్‌పూర్ 4 ప్రదేశాలలో జరుగుతుంది. పాత స్టైల్‌లో తమ స్టార్ ఆటగాళ్లను మరోసారి మైదానంలో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞులు కూడా తమ బ్యాట్‌కు పదును పెట్టారు. మైదానంలో టెండూల్కర్, రైనా, యువరాజ్ చెమటలు పట్టిస్తున్నారు.

భారత లెజెండ్ స్క్వాడ్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), సురేశ్ రైనా , యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, ఎస్ బద్రీనాథ్, స్టువర్ట్ బిన్నీ, నమన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, ప్రజ్ఞాన్ ఓజా, వినయ్ కుమార్, రాజేష్ పొవార్, రాహుల్, శర్మ