IND vs ENG: మెంటలోడు మొదలెట్టాడు..! బజ్‌బాల్ బెండు తీస్తున్న రిషభ్ పంత్.. వచ్చీ రావడంతోనే..!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో రిషభ్ పంత్ అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టుకు లీడ్ పెంచాడు. 18 బంతుల్లో 30 పరుగులు చేసిన పంత్, ఫోర్లు, సిక్సులతో ఇంగ్లాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లాండ్ ఆక్రమణాత్మక బౌలింగ్ వ్యూహానికి పంత్ బదులుగా దూకుడు బ్యాటింగ్‌తో సమాధానం ఇచ్చాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా డైనమైట్ రిషభ్ పంత్ తన కొట్టుడు మొదలెట్టాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పంత్ తన సహజ శైలి బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టీమిండియా 300 పైచిలుకు లీడ్ ఉంది. దాన్ని వేగంగా మరింత పెంచి.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టి.. వారిని వీలైనంత త్వరగా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే.. ఆలౌట్ చేసి బ్యాచ్ గెలిచేందుకు టీమిండియా బౌలర్ల వద్ద తగిన సమయం ఉంటుందని భావించిన పంత్ హిట్టింగ్‌కు దిగాడు.
గతంలో కూడా పలు సార్లు ఇలానే వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు కూడా. ఇక బజ్ బాల్ క్రికెట్ అంటూ ఇంగ్లాండ్ అగ్రెసివ్ స్ట్రాటజీతో ఆడుతుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బజ్ బాల్‌కు పంత్ బ్యాట్ పరేంటో చూపిస్తున్నాడు. గతంలో ఓ సారి టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మను బజ్ బాల్ క్రికెట్ గురించి అడిగినప్పుడు.. రోహిత్ బదులిస్తూ బహుషా వాళ్లు మా పంత్ ఆట చూసి ఉండరు అని సెటైరికల్‌గా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు పంత్ అదే చేసి చూపిస్తున్నాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేసి.. అదే అగ్రెసివ్ ఇంటెంట్‌తో ముందుకు వెళ్తున్నాడు.
THIS IS RISHABH PANT. THIS IS BOX OFFICE. pic.twitter.com/HMZ0SR1vQP
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..