Rishabh Pant Health: పంత్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్.. వన్డే ప్రపంచకప్‌ లిస్టు నుంచి ఔట్.. కారణం ఇదే..

రిషబ్ పంత్ గురించి ఓ బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. అతనికి మోకాలి, చీలమండకు డబుల్ సర్జరీ ఉంటుందని, ఆ తర్వాత అతను సుమారు 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని అంటున్నారు.

Rishabh Pant Health: పంత్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్.. వన్డే ప్రపంచకప్‌ లిస్టు నుంచి ఔట్.. కారణం ఇదే..
Rishabh Pant

Updated on: Jan 05, 2023 | 7:59 PM

ప్రమాదం తర్వాత, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రీఎంట్రీపై స్పష్టత రావడం లేదు. ప్రపంచ కప్ 2023 నాటికి తిరిగి జట్టులోకి వస్తాడని గతంలో అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. పంత్ సుమారు 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. పంత్ మోకాలి, చీలమండ శస్త్రచికిత్స గురించి వస్తోన్న వార్తలతో ఔననే సమాధానమే వినిపిస్తోంది. పంత్ మోకాలి, చీలమండ గాయం కోసం డబుల్ సర్జరీ చేయించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం, పంత్‌ను డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రి నుంచి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి బీసీసీఐ విమానంలో తరలించింది.

ఈ సర్జరీ కోసం పంత్ లండన్ వెళ్లొచ్చు. అయితే, ఆయన ఎప్పుడు వెళ్తారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ సర్జరీ తర్వాత పంత్ దాదాపు 9 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌తో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, “పంత్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతోనే డెహ్రాడూన్ నుంచి ముంబైకి తీసుకువచ్చారు. అతనికి విశ్రాంతి అవసరం. డెహ్రాడూన్‌లో ఇది సాధ్యం కాలేదు. ఇక్కడ అతను హై సెక్యూరిటీలో ఉంటాడు. కుటుంబ సభ్యులు మాత్రమే అతనిని కలుసుకోగలరు. అతను తన గాయాల నుంచి కోలుకున్న వెంటనే, అతని స్నాయువు గాయానికి సంబంధించిన చర్యను వైద్యులు నిర్ణయిస్తారని’ తెలిపారు.

తొమ్మిది నెలలు దూరంగా..

ఆయన మాట్లాడుతూ, “అతను ప్రయాణించడానికి సరిపోతాడని వైద్యులు భావించిన తర్వాత, శస్త్రచికిత్స కోసం అతన్ని లండన్‌కు పంపుతారు. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో మాకు ఇంకా తెలియదు. వాపు తగ్గిన తర్వాత, డాక్టర్ పార్దివాలా, అతని బృందం చికిత్స కోర్సును నిర్ణయిస్తారు. పంత్ మోకాలి, చీలమండ రెండింటికీ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇది అతనిని ఏమైనప్పటికీ తొమ్మిది నెలల పాటు దూరంగా ఉంచుతుంది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

“ప్రస్తుతం మేం అతని పునరాగమనం గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం అందరి దృష్టి అతని కోలుకోవడంపైనే ఉంది. అతన్ని కోలుకోనివ్వండి. ఆ తర్వాత పునరావాసం కోసం తిరిగి వస్తాడు. ఇది చాలా దూరంగా ఉంటుంది. అతను 100 శాతం బాగున్నప్పుడు, మేం అతని తిరిగి రావడం గురించి మాట్లాడుతాం. వారికి కావాల్సినవన్నీ బీసీసీఐ అందజేస్తుంది’ అని తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..