T20 World Cup 2022: సిడ్నీ నుంచి టీమిండియాకు ‘బ్యాడ్ న్యూస్’.. ఆ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌తో పెరిగిన కష్టాలు..

IND vs SA: భారత క్రికెట్ జట్టు మూడవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడవలసి ఉంది. అంతకు ముందు డికాక్, రూసోల ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో కష్టాలు పెరిగాయి.

T20 World Cup 2022: సిడ్నీ నుంచి టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌తో పెరిగిన కష్టాలు..
Team India

Updated on: Oct 27, 2022 | 1:39 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చివరి బంతికి 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి, టీ20 ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది. ఇక నేడు రెండో మ్యాచ్‌లో సిడ్నీలో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. సిడ్నీలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు, టీమిండియా బౌలర్లకు భారీ ముప్పు వాటిల్లింది. నిజానికి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు కలిసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీంతో టీమిండియాకు కష్టాలు మరింత పెరిగాయి. అదేంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం..

ఈ మ్యాచ్‌లో రిలే రస్సో, క్వింటన్ డి కాక్ 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 ప్రపంచకప్‌లో ఇది కొత్త రికార్డుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇంత భారీ భాగస్వామ్యం నెలకొనడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ రికార్డు హెర్షెల్ గిబ్స్, జస్టిన్ క్యాంప్ పేరిట ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2007 ప్రపంచకప్‌లోని తొలి మ్యాచ్‌లో 120 పరుగుల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. రస్సో, డి కాక్ కలిసి 11 సిక్సర్లు కొట్టారు. దక్షిణాఫ్రికా కేవలం 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కానీ, ఆ తర్వాత రస్సో-డి కాక్ జోడీ బంగ్లాదేశ్ బౌలర్లను బాదేశారు.

రూసో తుఫాను సెంచరీ..

సెంచరీ భాగస్వామ్య సమయంలో రూసో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఆటగాడు కేవలం 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, తర్వాతి 22 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. మరోవైపు డికాక్ 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. డి కాక్, రూసో 29 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని చేశారు. దీని తర్వాత అతను 10 ఓవర్లలో జట్టు స్కోర్‌ను 96 పరుగులకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాను 13.3 ఓవర్లలో 150 పరుగులకు చేర్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ టీమ్ ఇండియాకు ప్రమాద ఘంటికలే..

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల మంచి ఆటతీరు టీమిండియాలో డేంజర్ బెల్స్ మెగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. పెర్త్ పిచ్ నుంచి భారత బౌలర్లు ఖచ్చితంగా సహాయం పొందుతారు. కానీ, దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌పై ఆడటం అలవాటు చేసుకుంది. ఇప్పుడు వారి ఆటగాళ్లు కూడా మంచి ఫాంలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా రూసో వరుసగా రెండు టీ20 ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. ఈ ఆటగాడు ఇండోర్ టీ20లోనూ భారత్‌పై సెంచరీ సాధించాడు.