AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav: ఆమె సలహాలే నా జీవితాన్ని మార్చేశాయి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సూర్యకుమార్..

సూర్యకుమార్ యాదవ్ తన ప్రాక్టీస్‌లో కీలక మార్పులు చేసుకోవడంతోనే తుఫాన్ బ్యాటర్‌గా మారి టీమిండియాలో చోటు సంపాదించాడు. అయితే, ఇలా మారడం వెనుకు ఓ వ్యక్తి ఉన్నారంటూ..

Suryakumar Yadav: ఆమె సలహాలే నా జీవితాన్ని మార్చేశాయి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సూర్యకుమార్..
Suryakumar Yadav
Venkata Chari
|

Updated on: Oct 26, 2022 | 6:30 PM

Share

టీ20 క్రికెట్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్.. తన బ్యాటింగ్‌తో అందర్నీ మెప్పిస్తున్నాడు. అయితే, తన బ్యాటింగ్‌లో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందో తాజాగా ప్రకటించాడు ఈ మిస్టర్ 360 ప్లేయర్. భారత జట్టులో ఎంపిక కోసం చాలా కాలంగా ఎదురుచూసిన ఈ యంగ్ ప్లేయర్.. సెలెక్టర్లను ఆకర్షించేందుకు తన ఆట, ప్రాక్టీస్, ఆహారం అన్నీ మార్చుకున్నాడు. హార్డ్ వర్క్‌ను స్మార్ట్ వర్క్‌గా మార్చుకోవడంతో.. దాని ఫలితమే సూర్యకుమార్ యాదవ్‌ను ఈ రోజు టీమిండియా తరపున మ్యాచ్ విన్నర్‌లలో ఒకడిగా నిలిచాడు. సూర్యకుమార్ తన సతీమణి దేవిషాకు ఈ క్రెడిట్ అందించాడు. తన ప్రాక్టీస్ పద్ధతిని మార్చుకున్నానని, తన ఆహారంపై దృష్టి పెట్టానని, ఆఫ్‌సైడ్‌లో ఎక్కువ బ్యాటింగ్ చేశానని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

ESPNcricinfoతో మాట్లాడిన సూర్యకుమార్, “నా భార్య దేవిషా 2017-18లో ప్రాక్టీస్‌లో మార్పులు చేయాలని సూచించింది. ఆమె సలహా మేరకు తెలివిగా ముందుకుసాగాలని నేను నిర్ణయించుకున్నాను. ఏదైనా విభిన్నంగా చేయాలనేది మా లక్ష్యం. నేను వేరే విధంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. 2018 తర్వాత నేను నా ఆటలో మార్పులు గ్రహించాను. నేను ఆఫ్ సైడ్ వైపు మరిన్ని షాట్లు ఆడటం మొదలుపెట్టాను’ అంటూ తన సీక్రెట్ చెప్పుకొచ్చాడు.

డైట్ మాత్రమే కాదు.. బాడీలోనూ మార్పులు..

సూర్యకుమార్ మాట్లాడుతూ, ‘నేను డైట్‌పై దృష్టి పెట్టాను. తక్కువ ఆహారం తీసుకోవడం ప్రారంభించాను. 2018, 2019 దేశీయ సీజన్‌లో నాకు చాలా సహాయపడే కొన్ని పనులు నేను చేశాను. ఆ తర్వాత 2020లో నా శరీరం పూర్తిగా మారిపోయింది. ఫలితాల గురించి ఆలోచించకుండా సాధన చేస్తున్నానని, కొన్ని సమయాల్లో నిరుత్సాహానికి గురైనా.. పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నాను’ అంటూ సూర్యకుమార్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘అయితే, ఈ మార్పు కొద్దిరోజుల్లోనే రాలేదు. చాలా సమయం పట్టింది. నాకు ఏది సహాయపడుతుందో, నేను ఎలా ముందుకు వెళ్లగలనో అని గుర్తించడానికి మాకు ఏడాదిన్నర పట్టింది. ఆ తర్వాత నా భార్య, నేను సరైన దిశలో వెళ్తున్నామని గ్రహించాం. ఆపై ప్రతిదీ సరిగ్గా జరగడం ప్రారంభించింది. నేను ఏమి చేయాలో, ఎలా, ఎంత సాధన చేయాలో నాకు తెలుసు’ అంటూ ఈ మిస్టర్ 360 ప్లేయర్ తెలిపాడు.

అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా..

సూర్యకుమార్ యాదవ్‌ను ప్రస్తుత కాలంలో అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మెన్ అని పిలిస్తుంటారు. సూర్యకుమార్ యాదవ్ మైదానం చుట్టూ షాట్లు ఆడతాడు. ఈ ఆటగాడు ఫీల్డింగ్ చేయలేని అనేక షాట్‌లను ఆడడంలో ప్రసిద్ధిగాంచాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ T20 స్ట్రైక్ రేట్ 170 కంటే ఎక్కువగా ఉంటుంది. రానున్న కాలంలో ఈ యంగ్ ప్లేయర్ టీమిండియా తరపున మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.