IPL 2025: మరోసారి ఐపీఎల్‌ టీంకే కోచ్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగింది ఇదే: మాజీ దిగ్గజ ప్లేయర్

Ricky Ponting: రికీ పాంటింగ్ మళ్లీ ఐపీఎల్‌లో కోచ్‌గా మారాలనుకుంటున్నాడు. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతను ఈ ఫ్రాంచైజీతో ఏడేళ్లపాటు ఉన్నాడు. ఢిల్లీ తరపున ట్రోఫీని గెలవలేకపోవడం వల్లే తన కెరీర్ ముగిసిందని పాంటింగ్ అంగీకరించాడు. అయితే, మరోసారి ఐపీఎల్‌లో కనిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడంట.

IPL 2025: మరోసారి ఐపీఎల్‌ టీంకే కోచ్‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగింది ఇదే: మాజీ దిగ్గజ ప్లేయర్
Delhi Capitals
Follow us
Venkata Chari

|

Updated on: Aug 10, 2024 | 7:31 PM

Ricky Ponting: రికీ పాంటింగ్ మళ్లీ ఐపీఎల్‌లో కోచ్‌గా మారాలనుకుంటున్నాడు. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతను ఈ ఫ్రాంచైజీతో ఏడేళ్లపాటు ఉన్నాడు. ఢిల్లీ తరపున ట్రోఫీని గెలవలేకపోవడం వల్లే తన కెరీర్ ముగిసిందని పాంటింగ్ అంగీకరించాడు. అయితే, మరోసారి ఐపీఎల్‌లో కనిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడంట. ఢిల్లీ ఇప్పుడు ఒక భారతీయుడిని ప్రధాన కోచ్‌గా చేయగలదని పాంటింగ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ రివ్యూ పోడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘నేను మళ్లీ ఐపీఎల్‌లో కోచ్‌గా మారాలనుకుంటున్నాను. రెండేళ్లపాటు ముంబైలో కోచ్‌గా ఉన్నా.. ఆటగాడిగానూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అక్కడ ఎంజాయ్ చేశాను. దురదృష్టవశాత్తూ నేను, ఫ్రాంచైజీ కోరుకున్న విధంగా వర్కవుట్ కాకపోవడంతో నేను ఏడు సీజన్ల పాటు ఢిల్లీలో కొనసాగాను. అయితే, జట్టు ట్రోఫీని గెలవడానికి అంతా చాలా ప్రయత్నించాం. కానీ ఆ కోరిక తీరేలేదు.

‘ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం భారతీయుడిని ప్రధాన కోచ్‌గా చేయగలరని భావిస్తున్నాను. తనకు ఎక్కువ సమయం ఇచ్చి, ఆఫ్ సీజన్‌లో కూడా అందుబాటులో ఉండేలా కోరారు. కానీ, అలా కుదరలేదు. అయితే, ఇండియన్ కోచ్ వస్తే.. స్థానిక ఆటగాళ్లతో భారతదేశంలోనే గడపవచ్చు. నేను అలా చేయలేకపోయాను. కానీ, నేను కొంతమంది అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాను. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లతో కలిసి పనిచేసినందుకు నేను కృతజ్ఞుడను. రాబోయే రెండు నెలల్లో నాకు కొన్ని పెద్ద అవకాశాలు రావచ్చు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో మళ్లీ కోచ్‌‌గా చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.

పాంటింగ్‌కు ఇంగ్లండ్‌ కోచ్‌ కావాలని లేదు..

అయితే, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తదుపరి కోచ్ అయ్యే అవకాశాన్ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్పష్టంగా తిరస్కరించాడు. మాథ్యూ మోట్ నిష్క్రమణ కారణంగా ఖాళీ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్‌పై తనకు ఆసక్తి లేదని పాంటింగ్ చెప్పాడు. ప్రస్తుతం అలాంటి బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదు. అంతకుముందు, ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా పాంటింగ్ పేరు కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..