RCB vs SRH Highlights, IPL 2022: బెంగుళూర్‌పై హైదరాబాద్ ఘన విజయం
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Highlights: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూర్ టీం పూర్తి ఓవర్లు ఆడకుండానే కేవలం 16.1 ఓవర్లలో 68 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో హైదరాబాద్ ముందు 69 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంది.
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Highlights: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సునాయసనంగా విజయం సాధించింది. 12 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. బెంగుళూరు కేవలం 16.1 ఓవరల్లో 68 పరుగలకే కుప్పకూలింది. దీంతో 69 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విలియమ్‌సన్ 16 పరుగులు చేశాడు. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ కి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో హైదరాబాద్ (10) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన బెంగుళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్ బౌలర్ మార్కో మాన్‌సెన్ (3/25) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బెంగళూరు కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నటరాజన్ (3/10) విజృంభించాడు. వీరితోపాటు సుచిత్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (1/13), భువనేశ్వర్ (1/8) చెలరేగడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ డకౌట్ కాగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 12, ప్రభుదేశాయ్ 15, హసరంగ 8, షాహ్‌బాజ్ 7, డుప్లెసిస్ 5, హర్షల్ పటేల్ 4, హేజిల్‌వుడ్ 3*, సిరాజ్ 2 పరుగులు చేశారు.
జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
LIVE Cricket Score & Updates
-
బెంగుళూర్‌పై హైదరాబాద్ ఘన విజయం
హైదరాబాద్ తొమ్మిది వికెట్ల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. 69 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి అలవోకగా చేధించిది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విలియమ్‌సన్ 16 పరుగులు చేశాడు. బెంగుళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌కి ఒక వికెట్ దక్కింది.
-
44 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం
హైదరాబాద్ మొదటి వికెట్‌కి 44 బంతుల్లో 66 పరుగులు జోడించడం విశేషం. ఇందులో అభిషేక్ శర్మ 47 పరుగులు, విలియమ్ సన్ 15 పరుగులు చేశారు.
-
-
మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 47 పరుగులకి ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 7.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 5 పరుగుల దూరంలో ఉంది.
-
5 ఓవర్లకి హైదరాబాద్ 42/0
హైదరాబాద్ 5 ఓవర్లకి వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ 37 పరుగులు, కేన్ విలియమ్స్‌సన్ 3 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 90 బంతుల్లో 27 పరుగులు చేయాలి.
-
హైదరాబాద్ టార్గెట్ 69..
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్స్ బెంగళూర్ టీం పూర్తి ఓవర్లు ఆడకుండానే కేవలం 16.1 ఓవర్లలో 68 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో హైదరాబాద్ ముందు 69 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంచింది.
-
-
9వ వికెట్ డౌన్..
హసరంగా (8) రూపంలో బెంగళూర్ టీం 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 15.2ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.
-
8వ వికెట్ డౌన్..
హర్షల్ పటేల్ (4) రూపంలో బెంగళూర్ టీం 8వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 12.1ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.
-
ఏడో వికెట్ డౌన్..
షాబాజ్ అహ్మద్ (7) రూపంలో బెంగళూర్ టీం 7వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 9.2ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులు పూర్తి చేసింది.
-
దినేష్ కార్తీక్ ఔట్..
దినేష్ కార్తీక్ (0) రూపంలో బెంగళూర్ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 9వ ఓవర్‌లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8.5 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 47 పరుగులు పూర్తి చేసింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ..
ప్రభుదేశాయ్ (15) రూపంలో బెంగళూర్ టీం 5వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 8.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
-
5 ఓవర్లకు ఆర్‌సీబీ స్కోర్..
5 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూర్ టీం 4 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. సుయాస్ 1, షాబాస్ అహ్మద్ 0 పరుగులతో క్రజీులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో 3 వికెట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. జాన్సన్ వేసిన ఓవర్‌లో డుప్లెసిస్(5), కోహ్లీ(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరగా.. చివరి బంతికి అంజు రావత్(0) ఔట్ అయ్యాడు. దీనితో జాన్సన్ ఓవర్‌లో 3 పరుగులు మాత్రం రాగా.. 3 వికెట్లు పడ్డాయి. దీనితో 2 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 8 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం..
హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
-
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
-
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..
వరుసగా ఐదో మ్యాచ్ గెలిచేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
Published On - Apr 23,2022 7:00 PM