Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా శుక్రవారం (మార్చి 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. IPL 2024లో RCBకి ఇది మూడో మ్యాచ్ కాగా, KKR రెండో మ్యాచ్ ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా ఒక మ్యాచ్‌లో 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. మార్చి 22న టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై RCB ఓడిపోయింది. అనంతరం మార్చి 25న పంజాబ్ కింగ్స్‌పై చివరి ఓవర్‌లో విజయం సాధించి విజయం ఖాతా తెరిచింది. కేకేఆర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చివరి ఓవర్‌లో విజయం సాధించింది. రెండు జట్లకు గెలుపు ముఖ్యం కాబట్టి బెంగళూరులో ఇది హై వోల్టేజ్ మ్యాచ్ కావడం ఖాయం. ఇదిలా ఉంటే CSK, పంజాబ్‌లపై RCB బౌలింగ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అందువల్ల నేటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు ఉంటుంది. బెంగళూరులోని బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ల స్వభావాన్ని బట్టి, RCBకి బలమైన, అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం.
వెస్టిండీస్‌కు చెందిన సీమర్ అల్జారీ జోసెఫ్ గత రెండు మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో అతనిని ప్లేయింగ్ XI నుండి తప్పించవచ్చు. అతని స్థానంలో స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దాదాపుగా బరిలోకి దిగడం ఖాయం. అలాగే ఆర్‌సీబీ జట్టు బ్యాటింగ్ విభాగంలో కూడా మార్పు రావాల్సి ఉంది. గత ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నుంచి పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రజత్ పాటిదార్ కు నేడు అవకాశం దక్కడం అనుమానమే. అతని స్థానంలో సుయేష్ ప్రభుదేశాయ్ లేదా మహిపాల్ లుమ్రూర్ వచ్చే అవకాశం ఉంది.
Lockie Ferguson was in a beast form for New Zealand but but RCB played Alzarri Joseph over him 😂#TATAIPL #TATAIPL2024 #CSKvRCB #RCBvsCSK pic.twitter.com/OtVwrR7qLE
— Ankush Kumar (@ankush_06_) March 22, 2024
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయేష్ ప్రభుదేశాయ్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, లక్కీ ఫెర్గూసన్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..