RCB Vs KKR IPL 2021 Highlights: రసెల్ మెరుపులు వృధా.. కోహ్లీసేన హ్యాట్రిక్ విజయం.. కోల్‌కతా పరాజయం..

|

Updated on: Apr 18, 2021 | 7:20 PM

KKR vs RCB IPL 2021 Live Score: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా పదో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నైలో...

RCB Vs KKR IPL 2021 Highlights: రసెల్ మెరుపులు వృధా.. కోహ్లీసేన హ్యాట్రిక్ విజయం.. కోల్‌కతా పరాజయం..
Kkr Vs Rcb

KKR vs RCB IPL 2021 Highlights: చెపాక్ స్టేడియం వేదికగా కేకేఅర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయాన్ని అందుకుంది. 38 పరుగుల తేడాతో కోల్ కతాను మట్టి కరిపించి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్‌వెల్(78), డివిలియర్స్(76) మెరుపులకు 20 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టానికి 204 పరుగులు చేసింది. కేకేఅర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ద్ కృష్ణ, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక భారీ లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఅర్ నిర్ణీత ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టానికి 166 పరుగులు చేసింది. 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. రసెల్(31), మోర్గాన్(29) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఆర్సీబీ బౌలర్లలో జమిసన్ 3 వికెట్లు.. చాహల్, పటేల్ రెండేసి వికెట్లు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.

Key Events

కోల్‌కతా టీమ్:

నితీష్ రానా, శుభ్‌మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్(కెప్టెన్), షకిబుల్ హాసన్, దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

బెంగళూరు టీమ్:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), పడిక్కల్, రజత్ పటిధర్, మ్యాక్స్‌వెల్, డివిలియర్స్, సుందర్, షహ్బాజ్ అహ్మద్, జమిసన్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 Apr 2021 07:13 PM (IST)

    రసెల్ అవుట్.. ఆర్సీబీ గెలుపు..

    చివరి ఓవర్ లో రసెల్ అవుట్ కావడంతో.. ఆర్సీబీ గెలుపు లాంచనమైంది. 38 పరుగులు తేడాతో బెంగళూరు గెలుపొందింది. దీనితో కోహ్లీసేన హ్యాట్రిక్ విజయాలను సాధించింది. కేకేఅర్ నిర్ణీత ఓవర్లకు 166 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 07:10 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు…

    జమిసన్ ఓవర్‌ లో కేకేఅర్ రెండు వికెట్లు కోల్పోయింది. షకిబుల్ హాసన్, కమిన్స్ భారీ షాట్స్ ఆడేందుకు ప్రయతించి అవుట్ అయ్యారు. దీనితో 18 ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 161-7 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 06:59 PM (IST)

    రసెల్ విజృంభణ.. చాహల్ ఓవర్‌లో 6..4..4..4..

    ఆండ్రీ రసెల్ విజృంభిస్తున్నాడు. చాహల్ వేసిన ఓవర్‌లో వరుసగా 6..4..4..4.. కొట్టాడు. దీనితో ఆ ఓవర్ మొత్తంగా కేకేఅర్ 20 పరుగులు రాబట్టింది. ఇక 17 ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 146-5 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 06:41 PM (IST)

    మోర్గాన్ అవుట్...

    హర్షల్ పటేల్ బౌలింగ్ లో కేకేఅర్ కెప్టెన్ మోర్గాన్ అవుట్ అయ్యాడు. దీనితో 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 115/5 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 90 పరుగులు చేయాలి.

  • 18 Apr 2021 06:38 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు..

    మ్యాక్స్ వెల్ వేసిన ఓ ఓవర్ లో మోర్గాన్, షకిబుల్ హాసన్ రెండు సిక్సర్లు బాదారు. దీనితో 13 ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 112/4 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 06:31 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఅర్..

    భారీ లక్ష్యచేధనలో కేకేఅర్ నాలుగో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్ కార్తీక్ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. దీనితో తొమ్మిది ఓవర్లకు కేకేఅర్ 75-4 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 06:22 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన కేకేఅర్

    ఇన్ ఫామ్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానాను చాహల్ అవుట్ చేశాడు. 18 పరుగుల వద్ద నితీష్ రానా పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో ఏడు ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 67/3 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 06:03 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా..

    సుందర్ బౌలింగ్‌లో త్రిపాఠి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో కేకేఅర్ 12 పరుగులు రాబట్టింది. దీనితో ఆరు ఓవర్లు ముగిసేసరికి కేకేఅర్ 57-2 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:44 PM (IST)

    20 పరుగులు ఒక వికెట్..

    జమిసన్ బౌలింగ్ లో గిల్ వీరబాదుడు బాదాడు.. 20 పరుగులు రాబట్టాడు. అయితే ఐదో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కేకేఅర్ రెండు ఓవర్లు ముగిసేసరికి 27-1 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:42 PM (IST)

    మొదటి ఓవర్‌లో ఏడు పరుగులు..

    కేకేఅర్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మొదటి ఓవర్ ఏడు పరుగులు రాబట్టింది. దీనితో కేకేఅర్ ఒక ఓవర్ ముగిసేసరికి 7-0 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:18 PM (IST)

    చివరి ఓవర్ 21 పరుగులు అజేయంగా నిలిచిన డివిలియర్స్

    డివిలియర్స్ దుమ్ములేపాడు. చివరి ఓవర్ 21 పరుగులు రాబట్టి.. బెంగళూరు స్కోర్ ను 200 దాటించాడు. దీనితో 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 204/4 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:16 PM (IST)

    రెండు ఓవర్లు 35 పరుగులు.. డివిలియర్స్ హాఫ్ సెంచరీ...

    డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. రెండు ఓవర్లలో 35 పరుగులు రాబట్టాడు. తన అర్ధ శతకాన్ని కూడా పూర్తి చేసాడు. దీనితో 19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 183-4 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:10 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన మ్యాక్స్ వెల్...

    కమిన్స్ బౌలింగ్‌లో మ్యాక్స్ వెల్ హర్భజన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్ వెల్ 78 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 148-4 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 05:07 PM (IST)

    దుమ్ములేపుతున్న డివిలియర్స్.. వరుస ఫోర్లతో జోరు..

    వరుస ఫోర్లతో డివిలియర్స్ జోరు మీదున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు సంధించాడు. దీనితో బెంగళూరు 16 ఓవర్లు ముగిసేసరికి 145-3 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 04:52 PM (IST)

    డివిలియర్స్ వరుసగా రెండు ఫోర్లు.. మ్యాక్స్ వెల్ సిక్స్..

    వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డివిలియర్స్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అలాగే మ్యాక్స్ వెల్ చివరి బంతికి సిక్స్ కొట్టాడు. దీనితో 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 134-3 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 04:33 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. పడిక్కల్ అవుట్..

    ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి పడిక్కల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనితో 95 పరుగుల వద్ద బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. ఇక 12 ఓవర్లు ముగిసేసరికి అర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 04:30 PM (IST)

    10 ఓవర్లకు బెంగళూరు 84-2

    మ్యాక్స్ వెల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తుండటంతో బెంగళూరు జట్టు జోరు మీదుంది. 10 ఓవర్లు ముగిసేసరికి 84-2 పరుగులు చేసింది. ప్రస్తుతం మ్యాక్స్ వెల్ 55 పరుగులతో.. పడిక్కల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 18 Apr 2021 04:22 PM (IST)

    మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ.. తొమ్మిది ఓవర్లకు బెంగళూరు 78-2

    బిగ్ షో మళ్లీ మెరిశాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని మంచి పొజిషన్‌లో ఉంచాడు. దీనితో బెంగళూరు తొమ్మిది ఓవర్లకు 78-2 పరుగులు చేసింది. ప్రస్తుతం మ్యాక్స్ వెల్(50), పడిక్కల్(18)తో క్రీజులో ఉన్నారు.

  • 18 Apr 2021 04:12 PM (IST)

    హాఫ్ సెంచరీ దిశగా మ్యాక్స్ వెల్.. దుమ్ములేపుతున్న బిగ్ షో..

    మొదటిలోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత బిగ్ షో మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మంచి బంతులను బౌండరీలుగా మలుస్తూ అద్భుతమైన షాట్స్‌తో అలరిస్తున్నాడు. దీనితో ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్(42), పడిక్కల్(15)తో క్రీజులో ఉన్నారు.

  • 18 Apr 2021 04:10 PM (IST)

    ఒక ఓవర్‌లో 17 పరుగులు..

    షకిబుల్ హాసన్ వేసిన ఓవర్ లో మ్యాక్స్ వెల్ అద్భుతంగా ఆడాడు. ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టగా.. అటు పడిక్కల్ మంచి ఫోర్ సంధించాడు. దీనితో ఆ ఓవర్ లో 17 పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 45-2 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 04:08 PM (IST)

    ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..

    వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ఓ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో ఆర్సీబీ మొదటి వికెట్ కోల్పోయింది. అటు ఇదే ఓవర్ లాస్ట్ బాల్ కు వరుణ్ రజత్ పటిదర్ ను కూడా పెవిలియన్ కు పంపించడంతో బెంగళూరు రెండు ఓవర్లు ముగిసేసరికి 9-2 పరుగులు చేసింది.

  • 18 Apr 2021 04:03 PM (IST)

    మొదటి ఫోర్ కొట్టిన కోహ్లీ..

    హర్భజన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫోర్ సంధించాడు. దీనితో బెంగళూరు తన పరుగుల ఖాతాను తెరిచింది. ఒక ఓవర్ ముగిసేసరికి బెంగళూరు 6-0 పరుగులు చేసింది.

Published On - Apr 18,2021 7:13 PM

Follow us
Latest Articles
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..