Royal Challengers Bengaluru vs Chennai Super Kings: ఐపీఎల్ 17వ సీజన్ 68వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 162.07 స్ట్రైక్ రేట్‌తో 47 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదాడు. కేవలం 3 పరుగుల తేడాతో విరాట్ హాఫ్ సెంచరీ కోల్పోయాడు. అయితే తనను రన్ మెషిన్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు కింగ్ కోహ్లీ. ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ లో 13 పరుగులు పూర్తి చేసిన వెంటనే విరాట్ కోహ్లీ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మైదానంలో 3000 పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాటర్ గా విరాట్ నిలిచాడు. ఆర్సీబీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో విరాట్ 98 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. కోహ్లీ కొట్టిన షాట్ సీలింగ్ కు తగిలింది. ఇదే క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఒకే స్టేడియంలో అత్యధిక పరుగుల పరంగా కింగ్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తన సొంత మైదానం వాంఖడే స్టేడియంలో 2, 295 పరుగులు చేశాడు. అలాగే ఎం చిన్నస్వామి స్టేడియంలో ఏబీ డివిలియర్స్ 1, 960 పరుగులు చేశాడు.
కాగా, ఓపెనింగ్ జోడీ విరాట్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో RCBకి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత విరాట్ ఔటయ్యాడు.
Two lavish strokes to take your mind away from the rain delay 😉
Virat Kohli gets the Chinnaswamy crowd going 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/AGRH9nx83N
— IndianPremierLeague (@IPL) May 18, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ.
శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి
The @RCBTweets openers start in style!
Virat Kohli also completes 3000 runs at the Chinnaswamy Stadium 🏟️
Follow the Match ▶️ https://t.co/7RQR7B2jpC#TATAIPL | #RCBvCSK | @imVkohli pic.twitter.com/JFTY7OBsvn
— IndianPremierLeague (@IPL) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..