Video: చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్.. వైరల్ వీడియో..

Virat Kohli Run Out Video, PBKS vs RCB IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుస్తున్నాడు. గురువారం, మే 9, IPL 2024 58వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ధర్మశాలలో జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ తొలుత 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును 241 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ జట్టుకు సహకారం అందించాడు.

Video: చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్.. వైరల్ వీడియో..
Virat Kohli Running

Updated on: May 10, 2024 | 1:15 PM

Virat Kohli Run Out Video, PBKS vs RCB IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుస్తున్నాడు. గురువారం, మే 9, IPL 2024 58వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ధర్మశాలలో జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ తొలుత 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును 241 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ జట్టుకు సహకారం అందించాడు. పంజాబ్‌ తుఫాన్ బ్యాట్స్‌మెన్‌ శశాంక్‌ సింగ్‌ను రనౌట్‌ చేసి ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన అద్భుతమైన ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఈ ఉత్తేజకరమైన రనౌట్ ఘటన చోటుచేసుకుంది. లాకీ ఫెర్గూసన్ వేసిన నాల్గవ బంతికి, శామ్ కుర్రాన్ రెండు పరుగులు తీసే క్రమంలో బంతిని మిడ్ వికెట్ వైపు బంతిని కొట్టాడు. బౌండరీపై బంతి కోసం ఎదురుచూస్తున్న విరాట్ చిరుతపులి వేగంతో 30 గజాల సర్కిల్‌కు పరుగెత్తాడు. బంతిని అందుకుని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌కి గురిపెట్టాడు. బంతి నేరుగా వికెట్‌ను తాకింది. సకాలంలో క్రీజులోకి రాలేక శశాంక్ సింగ్ రనౌట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

శశాంక్ సింగ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ ఆటను మలుపు తిప్పింది. RCB విజయపథం మరింత సుగమమైంది. దీంతో కోహ్లి అద్భుత రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ రనౌట్ వీడియోను ఇక్కడ చూడండి..

ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ 153.51 స్ట్రైక్ రేట్‌తో 12 మ్యాచ్‌ల్లో 634 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. RCB 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. బెంగళూరుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాలంటే, ఈ రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి. ఇతర జట్ల ఫలితాలు RCBకి అనుకూలంగా ఉండాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..