AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదేందయ్యా జడేజా.. మ్యాచ్‌ మధ్యలో ఇలా చేశావ్.. టీమిండియాకు భారీ శిక్ష పడే ఛాన్స్?

Ravindra Jadeja stops Marnus Labuschagne While Running: దుబాయ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే క్రీజులో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. జడేజా ఈ చర్య కారణంగా, ఆస్ట్రేలియా పరుగులు కోల్పోవడమే కాకుండా స్మిత్ ఏకాగ్రత కూడా చెదిరిపోయింది.

Video: ఇదేందయ్యా జడేజా.. మ్యాచ్‌ మధ్యలో ఇలా చేశావ్.. టీమిండియాకు భారీ శిక్ష పడే ఛాన్స్?
Ravindra Jadeja Stops Marnus Labuschagne
Venkata Chari
|

Updated on: Mar 04, 2025 | 5:17 PM

Share

Ravindra Jadeja stops Marnus Labuschagne While Running: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠ పోరాటం జరుగుతుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి అలాంటిదే కనిపించింది. కానీ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే విషయం ఒకటి చోటు చేసుకుంది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. టీం ఇండియా తరపున బౌలింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా బౌలింగ్‌ వేస్తున్న సమయంలో పరుగు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లాబుస్చాగ్నేను ఆపి, పూర్తిగా రెండు చేతులతో బంధించాడు.

మార్చి 4 మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్ తొలి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి వికెట్‌ను ముందుగానే కోల్పోయింది. కానీ, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కొన్ని అద్భుతమైన షాట్లతో అలరించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి బంతికి ఔటయ్యాడు. ఇక్కడి నుంచి మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నారు. వారిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. దీంతో జట్టు 100 పరుగుల మార్కును దాటింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతితో ఆస్ట్రేలియాకు పరుగులు సాధించే అవకాశం లభించింది. ఆ ఓవర్‌లోని రెండో బంతికి స్మిత్ జడేజా బౌలింగ్‌లో ఆన్ డ్రైవ్ ఆడాడు. కానీ, జడేజా తన కుడి వైపుకు కదిలి బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. బంతి అతని పాదాన్ని తాకి షార్ట్ మిడ్‌వికెట్ వైపు వెళ్లింది. ఆ తర్వాత స్మిత్, లాబుషేన్ పరుగులు సాధించడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. స్మిత్ తన క్రీజు నుంచి ఒకటి లేదా రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ, జడేజా, లాబుషేన్ ఒకరినొకరు ఢీకొన్నారు. ఇక్కడే భారత బౌలర్ లాబుషేన్‌ను తన రెండు చేతులతో పట్టుకుని పరిగెత్తకుండా ఆపాడు.

ఈలోగా ఫీల్డర్ వచ్చి బంతిని పట్టుకున్నాడు. ఆస్ట్రేలియా 1 పరుగు తీసే అవకాశాన్ని కోల్పోయింది. దీన్ని చూసి జడేజా నవ్వడం మొదలుపెట్టాడు. కానీ, స్టీవ్ స్మిత్ దీనిపై కోపంగా ఉండి అంపైర్‌కు అభ్యంతరం చెప్పడం ప్రారంభించాడు. అంపైర్ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోయినా, ఆస్ట్రేలియా దాని కారణంగా నష్టపోయింది. ఆ తరువాతి 4 బంతుల్లో ఒక్క పరుగు నమోదు కాలేదు. ఇది స్మిత్ దృష్టి మరల్చింది. అతను తరువాతి ఓవర్లో కూడా 4 డాట్ బాల్స్ ఆడాడు. ఫలితంగా అతను 10 బంతుల్లో ఒక్క పరుగూ రాబట్టలేకపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జడేజా లాబుషేన్ వికెట్ కూడా తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..