
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి పోటీలో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. అసలే ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు ఇప్పుడు స్ట్రోకు మీద స్ట్రోకు తగులుతోంది. విశాఖపట్నంలో ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ నుంచి స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తప్పుకున్నారు. BCCI స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు రవీంద్ర జడేజా గాయపడ్డాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగు కోసం పరుగులు తీస్తున్న జడేజా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత త్రోతో రనౌట్ అయ్యాడు. అప్పటికే గాయంతో బాధపడుతున్నాడు రవీంద్ర. అతనితో పాటు, కేఎల్ రాహుల్ కూడా కుడి తొడ నొప్పితో బాధపడుతున్నారని, వారిద్దరూ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటారని బీసీసీఐ తెలిపింది. మరోవైపు గాయం కారణంగా జట్టుకు దూరమైన జడేజా, రాహుల్ స్థానంలో ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ లయన్స్ పై అద్భుత ప్రదర్శన చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించాడు. రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు బదులుగా వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు కల్పించారు. వీరిద్దరితో పాటు తొలి టెస్టు ప్రారంభానికి ముందే జట్టు నుంచి విడుదలైన అవేశ్ ఖాన్ స్థానంలో సౌరభ్ కుమార్ జట్టులోకి ఎంపికయ్యాడు.
గాయం కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేశారు. కేఎల్ రాహుల్ 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రవీంద్ర జడేజా కూడా 87 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరును 400 దాటించాడు. దీంతో పాటు బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేసిన జడేజా 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. మరి వీరిద్దరి అందుబాటులో లేని పరిస్థితిని కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, సర్ఫరాజ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.
NEWS 🚨 – Ravindra Jadeja & KL Rahul ruled out of the second Test.
More details on the replacements here –https://t.co/nK9WjnEoRc #INDvENG
— BCCI (@BCCI) January 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..