MS Dhoni: ఐపీఎల్ 2025లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోని.. ఆ రూల్‌తో మారిన సీన్?
MS Dhoni May Playing As Uncapped Player: IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయి. ఎవరిని రిటైర్ చేయాలి, ఎవరిని విడుదల చేయాలని తెగ ఆలోచిస్తున్నాయి.
MS Dhoni May Playing As Uncapped Player: IPL 2025 గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే రాబోయే సీజన్‌కు ముందు మెగా వేలం కూడా జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయి. ఎవరిని రిటైర్ చేయాలి, ఎవరిని విడుదల చేయాలని తెగ ఆలోచిస్తున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాలుపంచుకుంది. ఎంఎస్ ధోని విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అదే సమయంలో, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు నిష్క్రమించి ఐదేళ్లు పూర్తయినందున, చెన్నై ఫ్రాంచైజీ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించాలని కోరుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
వాస్తవానికి, IPLలో 2008 నుంచి 2021 వరకు ఒక నియమం ఉంది. దీని ప్రకారం ఒక ఆటగాడు ఐదేళ్ల రిటైర్మెంట్ పూర్తి చేస్తే, అప్పుడు అతన్ని అన్‌క్యాప్డ్‌గా కొనసాగించవచ్చు. అయితే, ఈ నియమం ఎప్పుడూ ఉపయోగించబలేదు. కానీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఈ నిబంధనను ఉపయోగించి, ఎంఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించాలని కోరుకుంటుంది. అయితే, కొన్ని ఫ్రాంచైజీలు దీనికి అనుకూలంగా లేవు. ధోనీ గత సీజన్‌లోనే CSK కెప్టెన్సీని విడిచిపెట్టాడు. ఇప్పుడు అతను రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీజన్ మొత్తం ఆడాడు.
ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కొనసాగించే అవకాశం?
తన యూట్యూబ్ ఛానెల్‌లో, రవిచంద్రన్ అశ్విన్ IPL రిటెన్షన్ నియమాల గురించి మాట్లాడాడు. ఎంఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచడంపై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ.. “ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. ఇది నిజం. అతను చాలా సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతను రిటైర్ అయ్యాడు. కాబట్టి అతను అన్‌క్యాప్డ్ ప్లేయర్. అతను క్యాప్డ్ ప్లేయర్ కాదు. ఈ విషయంలో ఏం చేయలేం. ధోని లాంటి ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడతాడా? లేదా అనేది చూడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
తదుపరి IPL సీజన్‌లో ఆడే అవకాశం గురించి ఎంఎస్ ధోని ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఎక్కువగా రిటెన్షన్‌కి సంబంధించిన నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, మహి అభిమానులు తమ అభిమాన ఆటగాడు మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..