Video: ఏం డెడికేషన్‌రా బాబు.. కుడిచేయి చేయి విరిగినా.. లెఫ్ట్ హ్యాండ్‌తో ఇరగదీసిన ఆంధ్రా కెప్టెన్.. సలామంటోన్న నెటిజన్లు..
Hanuma Vihari Fractured Wrist: ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి ధైర్యానికి అంతా సెల్యూట్ చేస్తున్నారు. మణికట్టు విరిగినా, విహారి బ్యాటింగ్ కోసం మైదానంలోకి దిగడంతో మాజీల నుంచి నెటిజన్ల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Hanuma Vihari Fractured Wrist: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి గాయపడ్డాడు. అవేశ్ ఖాన్ వేసిన బౌన్సర్‌ను ఆడే క్రమంలో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ విహారి మణికట్టుకు గాయమైంది. వెంటనే మైదానం వదిలి బయటకు వెళ్లాడు. అప్పటి వరకు తన ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఆడాడు. కానీ, గాయం ఉన్నప్పటికీ, 29 ఏళ్ల ఆటగాడు మళ్లీ మైదానంలోకి దిగి 20 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే విహారి రెండోసారి ఆడేందుకు వచ్చినప్పుడు ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేశాడు. అతను 57 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. చివరకు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు.
విహారి ధైర్యాన్ని క్రికెట్ అభిమానుల నుంచి వెటరన్ క్రికెటర్ల వరకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ట్విట్టర్‌లో “హనుమ విహారి ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. ముఖ్యంగా అతను ఒక చేతితో మాత్రమే ఆడతాడు” అంటూ రాసుకొచ్చాడు. అలాగే విహారి నిజమైన ఫైటర్ అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్ చేశాడు. అదే సమయంలో, మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్, “మణికట్టు గాయం ఉన్నా.. ఎడమ చేతితో అది కూడా ఒక చేత్తో బ్యాటింగ్” అంటే పొగడ్తలతో ముంచెత్తాడు. మీ ధైర్యానికి వందనం అంటూ కామెంట్ పంచుకున్నాడు.
— cricket fan (@cricketfanvideo) February 1, 2023
ఆటగాళ్లతో పాటు ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా విహారిపై ప్రశంసలు కురిపించారు. “హనుమ విహారి ఎంత బలమైన, ధైర్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఈరోజు అతను తన మణికట్టులో ఫ్రాక్చర్ కారణంగా ఎడమచేతితో బ్యాటింగ్ చేశాడు. కొన్ని అదనపు పరుగులు చేస్తే తేడా దొరుకుతుందనే నమ్మకంతో మైదానంలోకి అడుగుపెట్టాడు. సిడ్నీ 2021, అశ్విన్‌తో ఆ భాగస్వామ్యం మీకు గుర్తుందా? అందులో అతను భారత్‌ను సిరీస్‌లో సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ను ఓటమి నుంచి రక్షించాడు” అంటూ పేర్కొన్నాడు.
? Hat’s off to @Hanumavihari na for coming to bat after getting fractured on left hand wrist Vcourageous decision ? #hanumavihari #RanjiTrophy pic.twitter.com/z0tkqqL3NI
— Vinay_Reddy.29 (@Rexxy_09) February 1, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..