Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ – 2022లో బెంగాల్ జట్టు చరిత్ర సృష్టించింది. జార్ఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 773/7భారీ స్కోరు సాధించింది. ఇది పెద్ద విషయమేమీ కాదు. అయితే ఆ జట్టులో టాప్-9 బ్యాటర్లు యాభైకి పైగా స్కోర్లు చేయడమే అసలు విశేషం. మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ రామన్ (61), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (65) 132 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత ఘరామి (186), మజుందార్ (117)లు తర్వాత సెంచరీలతో చెలరేగారు. ఆపై వెటరన్ బ్యాటర్, ఎంపీ మనోజ్ తివారీ 173 బంతుల్లో 73 పరుగులు చేయగా.. వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ (68), షాబాజ్ అహ్మద్ (78), సయన్ మొండల్ (53నాటౌట్), ఆకాశ్ దీప్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇదేం బ్యాటింగ్ రా నాయనా..
ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో టాప్-9 మంది బ్యాటర్స్ ఒకే ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధసెంచరీ చేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది బ్యాటర్లు ఆక్స్‌ఫర్డ్ అండ్ కేమ్‌బ్రిడ్జ్ యునివర్సిటీ జట్టుపై అర్ధసెంచరీలు సాధించారు. అయితే ఈ 8 మంది టాప్-8 బ్యాటర్స్ మాత్రం కాదు. తాజాగా బెంగాల్ జట్టు మాత్రం ఈ విషయంలో 129 ఏళ్ల ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ బ్యాటింగ్ హైలెట్ అని చెప్పుకోవాలి. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను కేవలం 18 బంతులే ఎదుర్కొని 294.44స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 8 సిక్స్‌లు ఉండడం విశేషం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇదే అతని మొట్టమొదటి అర్ధసెంచరీ కావడం మరో విశేషం.
Bengal became the first team in First-Class Cricket to feature 9 fifties in an innings. Only nine of them have batted, by the way.#RanjiTrophy #BENvJHA #RanjiTrophy #QF1 pic.twitter.com/2ojnwleN7W
— Extra Pace (@Extra_Pace) June 8, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: