AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup: నంబర్ 1గా వైభవ్ సూర్యవంశీ.. కట్‌చేస్తే.. ఆ నలుగురు టీమిండియా తోపులకు ఇచ్చిపడేశాడుగా..?

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో మరో సంచలనం ఉద్భవించింది. 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ బరిలోకి దిగి రికార్డులు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు టీమిండియా సీనియర్ స్టార్ల రికార్డులకు ఎసరు పెడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ రేసులో ఉన్న స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ 'టీనేజ్' బ్యాటర్‌గా నిలిచేందుకు వైభవ్ సిద్ధమయ్యాడు.

ODI World Cup: నంబర్ 1గా వైభవ్ సూర్యవంశీ.. కట్‌చేస్తే.. ఆ నలుగురు టీమిండియా తోపులకు ఇచ్చిపడేశాడుగా..?
Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Mar 24, 2026 | 11:41 AM

Share

ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటికే బీసీసీఐ సుమారు 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే, ఐపీఎల్ వేదికగా ఈ స్టార్ ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టేందుకు రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూసుకొస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2026 సీజన్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

పృథ్వీ షా రికార్డుకు పొంచి ఉన్న ముప్పు..

ఐపీఎల్ చరిత్రలో టీనేజర్‌గా (20 ఏళ్ల లోపు) అత్యధిక పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం పృథ్వీ షా పేరిట ఉంది. ఆయన 598 పరుగులు చేశాడు. అయితే పృథ్వీ షా ప్రస్తుతం ప్రపంచకప్ రేసులో లేకపోయినప్పటికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు మాత్రం 2027 వరల్డ్ కప్ బరిలో నిలిచే అవకాశం ఉంది. వారు ఎవరంటే:

ఇషాన్ కిషన్: 594 పరుగులు

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్: 564 పరుగులు

సంజూ శాంసన్: 545 పరుగులు

శుభ్‌మన్ గిల్: 499 పరుగులు

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు ఉన్నాయి. అంటే మరో 347 పరుగులు సాధిస్తే, పృథ్వీ షాతో పాటు గిల్, పంత్, శాంసన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా వైభవ్ అగ్రస్థానానికి చేరుకుంటాడు.

ఐపీఎల్ 2026లో నంబర్ 1 ఖాయమేనా?

గత సీజన్‌లో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే వైభవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పూర్తి సీజన్ ఆడితే, ఈ 347 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదు. తన దూకుడైన ఆటతీరుతో ఈ మైలురాయిని అధిగమిస్తే, 2027 వన్డే ప్రపంచకప్ సెలెక్టర్ల దృష్టిలో పడటం కూడా సులభం అవుతుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల రికార్డులను తుడిచిపెట్టేందుకు ఈ బుడతడు సిద్ధమవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us