AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Dravid: వన్డే సిరీస్ ఓటమిపై ద్రవిడ్ స్పందన.. వారికి చాలా అవకాశాలు ఇచ్చామంటూ వ్యాఖ్యలు..

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 3-0తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో మిడిలార్డర్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది....

Rahul Dravid: వన్డే సిరీస్ ఓటమిపై ద్రవిడ్ స్పందన.. వారికి చాలా అవకాశాలు ఇచ్చామంటూ వ్యాఖ్యలు..
Dravid
Srinivas Chekkilla
|

Updated on: Jan 24, 2022 | 7:15 PM

Share

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 3-0తో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో మిడిలార్డర్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనిపై కోచ్ ద్రవిడ్  స్పందించాడు. ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చామని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు. మిడిల్ ఓవర్లలో కొన్ని చెత్త షాట్లు ఆడారని అన్నారు. ద్రవిడ్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తుంది.

‘మేము వారికి తరచుగా అవకాశాలు ఇచ్చాము. మేము వీలైనంత ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాము. వారు 4, 5 లేదా 6 నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నా, జట్టు అవసరాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రేయాస్ అయ్యర్ తొందరగానే ఔటయ్యాడు. వారందరూ బాగా పనిచేస్తున్నారని మాకు తెలుసు. మేము వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాము. కానీ జట్టులో ప్రతి స్థానానికి పోటీ చాలా ఉంది.’ అని ద్రవిడ్ చెప్పాడు.

వన్డే సిరీస్​లో 20 నుంచి 40వ ఓవర్ల మధ్య భారత బ్యాట్స్‌మెన్లు సరిగా ఆడలేదని ద్రవిడ్ అంగీకరించాడు. కేఎల్ రాహుల్కెప్టెన్సీ గురించి అడిగిన ప్రశ్నకు, అతను చేయగలిగినంత చేశాడు. భారత్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు వెంకటేష్ మిడిల్ ఆర్డర్‌లో తనను తాను మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుందని ద్రవిడ్ చెప్పాడు. KKR కోసం IPL లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత జట్టులో చోటు సంపాదించాడు.”వెంకటేష్ వంటి ఆటగాళ్లను సిద్ధం చేయడం అవసరం’ అని పేర్కొన్నాడు. 2023 ప్రపంచకప్‌కు ముందు వీలైనన్ని వన్డేలు ఆడితే జట్టు కూర్పుపై స్పష్టత వస్తుందని ద్రవిడ్ చెప్పాడు.

Read Also.. Vamika: వామిక ఫొటోలు నెట్టింట వైరల్.. కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ..!