- Telugu News Sports News Cricket news Psl 2025 pakistan player sahibzada farhan equals virat kohli gill gayle world record
ఎవర్రా సామీ నువ్వు.. ఒకే షాట్‌తో కోహ్లీ, గేల్‌లకు ఇచ్చిపడేశావ్.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
Sahibzada Farhan Record, PSL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఓపెనర్‌గా ఆడుతున్న సాహిబ్జాదా ఫర్హాన్ తుఫాన్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. విశేషమేమిటంటే, అతను విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు.
Updated on: Apr 15, 2025 | 11:57 AM

Sahibzada Farhan Record, PSL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ 5వ మ్యాచ్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును లిఖించాడు. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన యునైటెడ్ జట్టుకు సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఓవర్ నుంచే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఫర్హాన్, కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ సెంచరీతో, సాహిబ్జాదా ఫర్హాన్ ఒకే సంవత్సరంలో టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. ఈ రికార్డు సాధించిన మొదటి పాకిస్తానీ బ్యాట్స్‌మన్, ప్రపంచంలో 5వ బ్యాట్స్‌మన్ కూడా అయ్యాడు.

దీనికి ముందు, క్రిస్ గేల్ (2011), విరాట్ కోహ్లీ (2016), జోస్ బట్లర్ (2022), శుభ్‌మాన్ గిల్ (2023) ఒకే సంవత్సరంలో 4 టీ20 సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు, ఈ రికార్డును సమం చేయడం ద్వారా, సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఈ ఏడాది సాహిబ్‌జాదా ఫర్హాన్ మొత్తం 4 టీ20 సెంచరీలు చేశాడు. ప్రత్యేకత ఏమిటంటే ఫర్హాన్ బ్యాట్ నుంచి వచ్చిన ఈ 4 సెంచరీలు కేవలం 9 ఇన్నింగ్స్‌లలో వచ్చాయి. రావల్పిండిలో సాధించిన సెంచరీ సహాయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పెషావర్ జల్మి 141 పరుగులకు ఆలౌట్ అయింది.





























