Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు.. టీమిండియా బెస్ట్ వికెట్‌కీపర్.. కట్ చేస్తే.. మ్యాచ్ ఆడిన మరుసటి రోజే!

భారత క్రికెట్‌లో బెంగాల్ ఆటగాడి అంటే కచ్చితంగా ముందుగా గుర్తొచ్చేది సౌరవ్ గంగూలీ. అతడే కాదు బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా, మనోజ్ తివారీలతో..

20 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు.. టీమిండియా బెస్ట్ వికెట్‌కీపర్.. కట్ చేస్తే.. మ్యాచ్ ఆడిన మరుసటి రోజే!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 28, 2023 | 10:14 AM

భారత క్రికెట్‌లో బెంగాల్ ఆటగాడు అంటే కచ్చితంగా ముందుగా గుర్తొచ్చేది సౌరవ్ గంగూలీ. అతడే కాదు బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా, మనోజ్ తివారీలతో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మరి టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి బెంగాల్ ఆటగాడు ఎవరో తెలుసా? మరెవరో కాదు ప్రొబీర్ సేన్.

అతడు బెస్ట్ వికెట్ కీపర్.. అరంగేట్రం చేసిన అతికొద్ది మ్యాచ్‌లలోనే తన ప్రతిభను చాటుకున్నాడు. 14 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల్లో 20 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు చేశాడు. 1948 -52 మధ్య ప్రొబీర్ సేన్ టీమిండియాకు ఆడాడు. దేశీయ క్రికెట్‌లో అయితే అతడు ఎన్నో రికార్డులు సృష్టించాడు. సేన్ ఎంతో అద్భుతమైన  లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 15 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 3 సెంచరీలతో సహా 2580 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే 107 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీలో 1796 పరుగులు చేశాడు. అంతే కాదు 1954-1955లో ఒడిశాపై హ్యాట్రిక్ కూడా సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు నిరంతరం అద్భుతాలు సృష్టించాడు. 40 ఏళ్లు దాటినా చురుగ్గా ఉండే ఆయన ఓ రోజు హఠాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

భారత్ తరఫున ఆడిన తొలి బెంగాల్ క్రికెటర్ ప్రపంచానికి వీడ్కోలు పలికి నేటికి 53 ఏళ్లు. అతడు 43 సంవత్సరాల వయస్సులో 27 జనవరి 1970న మరణించాడు. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌ అనంతరం మరుసటి రోజే గుండెపోటుతో ప్రొబీర్ సేన్ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

కాగా, సేన్ అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడితే, 1948లో ఆస్ట్రేలియాతో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 4 క్యాచ్‌లు, ఇంగ్లాండ్‌పై చెన్నైలో 5 స్టంపింగ్‌లు చేశాడు. ఇది అతడి అత్యుత్తమ ప్రదర్శన.