IND vs NZ 1st T20I: 196 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టిన మిచెల్.. తేలిపోయిన భారత బౌలర్లు.. టార్గెట్ 177..

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 177 పరుగల టార్గెట్‌ను ఉంచింది.

IND vs NZ 1st T20I: 196 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టిన మిచెల్.. తేలిపోయిన భారత బౌలర్లు.. టార్గెట్ 177..
Team India Players
Follow us

|

Updated on: Jan 27, 2023 | 8:45 PM

IND vs NZ 1st T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 177 పరుగల టార్గెట్‌ను ఉంచింది. డారిల్ మిచెల్ అత్యధికంగా అజేయంగా 59 పరుగులు చేశాడు. ఓపెనర్ డ్వేన్ కాన్వే 52 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 35 పరుగులతో భీకర ఇన్నింగ్స్ ఆడాడు.

మైకేల్ బ్రేస్‌వెల్ ఒక పరుగు చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. అతడిని ఇషాన్ కిషన్ అవుట్ చేశాడు. అంతకుముందు డ్వేన్ కాన్వే (52 పరుగులు) దీపక్ హుడా చేతిలో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ (17 పరుగులు)ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. మార్క్ చాప్‌మన్ (0), ఫిన్ అలెన్ (35 పరుగులు) వాషింగ్టన్ సుందర్‌ చేతికి చిక్కారు. భారత బౌలర్లలో సుందర్‌కు రెండు, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ లభించాయి.

టీమ్ ఇండియా ప్లేయింగ్-11:

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్-11:

ఫిన్ అలెన్, డ్వేన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్, ఇషా సోధి, లాకీ ఫెర్గూసన్.