AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithvi Shaw: డబుల్ సెంచరీ తర్వాత బాడీ షేమింగ్‌.. తిప్పికొట్టిన సోషల్ మీడియా ఫ్యాన్స్..

Prithvi Shaw Double Century: కౌంటీ క్రికెట్‌లో చెలరేగిపోయాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున పృథ్వీ షా అద్భుతమైన డబుల్ సెంచరీతో ఊగిపోయాడు. నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతున్న 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా సోమర్‌సెట్‌పై 153 బంతుల్లో 244 పరుగులు చేసి.. తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో సోషల్ మీడియాలో కొందరు బాడీ షేమింగ్‌కు దిగారు. వారి వెక్కిరింతను తిప్పికొట్టారు చాలా నెటిజన్లు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Prithvi Shaw: డబుల్ సెంచరీ తర్వాత బాడీ షేమింగ్‌.. తిప్పికొట్టిన సోషల్ మీడియా ఫ్యాన్స్..
Prithvi Shaw
Sanjay Kasula
|

Updated on: Aug 11, 2023 | 12:00 PM

Share

టీమిండియా జట్టుకు దూరమైన యువ ఓపెనర్ ఇంగ్లండ్‌లో జరిగిన ఓ కౌంటీ క్రికెట్‌లో చెలరేగిపోయాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున పృథ్వీ షా అద్భుతమైన డబుల్ సెంచరీతో ఊగిపోయాడు. నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతున్న 23 ఏళ్ల బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా సోమర్‌సెట్‌పై 153 బంతుల్లో 244 పరుగులు చేసి.. తన సత్తా ఏంటో చూపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా పృథ్వీ షా తిరిగి వస్తాడా.. నిజానికి, కౌంటీ క్రికెట్‌లో పృథ్వీ షా అద్భుతమైన సెంచరీ సాధించాడు. మ్యాచ్ ఆరంభ ఓవర్ల నుంచే షా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 81 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇక్కడి నుంచి మరింత దూకుడు పెంచి కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంటే 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో షా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

టీమిండియాలో రనౌటవుతున్న స్టార్ ఓపెనర్ పృథ్వీ షా తన బ్యాట్‌తో ఇంగ్లండ్‌లో పెను తుపాను సృష్టించాడు. పృథ్వీ షా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వన్డే కప్ ఆడుతున్నాడు. ఇక్కడ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి సీనియర్ల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో పాటు ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు తాను వస్తున్నానంటూ చూపించుకున్నాడు. అయితే, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. సోషల్ మీడియాలో అతనిపై కామెంట్స్ రన్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండిగ్‌లోకి వచ్చాడు. బ్యాట్‌తో వీర విహారం చేస్తున్న సమయంలో కొందరు అతడిని బాడీ షేమింగ్ మొదలు పెట్టారు. ఈ వ్యాఖ్యలలో కొన్నింటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

23 ఏళ్ల యువకుడు బాల్డ్ హెడ్‌తో.. లావుగా (బల్క్-అప్ ఫిజిక్) చూడగానే ఇతను ఎవరు రా బాబు.. అనుకునేలా కనిపించాడు. అంతేకాదు దీనిపైనే సోషల్ మీడియా మొత్తం కామెంట్స్ రన్ అయ్యాయి. రన్ రాజా రన్ అంటూ రెండు వికెట్ల మధ్య షా పరుగులు పెడుతుంటే సోషల్ మీడియా యూజర్లు మాత్రం అనతి బాడీపై కామెంట్స్ రన్ చేశారు. కామెంట్స్ ఎలాంటివంటే.. అపహాస్యం, అవహేళనలు భారీ ఎత్తున జరగాయి.. అటువంటి అవమానకరమైన బాడీ-షేమింగ్ కామెంట్స్‌కు చాలా మంది రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దీంతో షాకు షాక మద్దతు తెలిపేవారి సంఖ్య కూడా ఒక్కసారిగా పెరగడంతో వ్యతిరేకించేవారి సంఖ్య తగ్గింది. షా దూకుడైన బ్యాటింగ్ పరాక్రమాన్ని అభినందించాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.

షాకు మద్దతుగా ఓ యూజర్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “మేము ఒక దేశంలో నివసిస్తున్నాము. అక్కడ మనిషి నైపుణ్యాల కంటే అతని రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పృథ్వీ షాకు పూర్తి గౌరవం, అతను తన రూపాన్ని బట్టి నిర్ణయించబడతాడని తెలిసినప్పటికీ, అతను జిమ్‌కు వెళ్లకుండా ఫీల్డ్‌కి వెళ్లి 129 బంతుల్లో 200 పరుగులు చేయాలని చేశాడు. అందంగా కనిపించేలా శరీరాన్ని నిర్మించి, తన లుక్‌లతో ఇతరులను ఆకట్టుకోవాలని కాదు.. తన ఆటతీరుతో మెప్పు పొందాలని నిర్ణయించుకున్నాడంటూ వ్యాఖ్యానించారు.

మరో ట్విట్టర్ యూజర్ చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. “తనతో మాట్లాడటానికి ఎవరూ లేరని చెప్పిన ఓ యువ క్రికెటర్‌ని ఎగతాళి చేయడం ఎంతవరకు సమంజసం? అతను తన మానసిక స్థాతి సరిగ్గాలేదని చెప్పినా అతన్ని మీరు తిడుతూనే ఉంటారా? ఇటీవలే తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి వెల్లడించిన షా గతంలో మనోభావాలను వెల్లడిచాడు. తనకు పెద్దగా స్నేహితులు లేరని.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని.. వారితో కూడా తాను అన్ని విషయాలు పంచుకోనంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బాడీ-షేమింగ్‌తో కూడిన తొలి ట్వీట్‌ను పోస్ట్ చేసిన తర్వాత, అతను తన తప్పును గ్రహించాడు. అతని సున్నితత్వానికి క్షమాపణలు చెప్పాడు రచయిత అంకుర్. “ప్రజల ప్రతిస్పందనల తర్వాత నేను నా తప్పును గ్రహించాను. ఈ ఫోటో 4 సంవత్సరాల వయస్సులో తన తల్లిని కోల్పోయిన పృథ్వీ షాది.”

టీమిండియా లెజెండరీ ఆటగాడు సంచిన్ టెండూల్కర్‌ ఆటతీరును షా మరిపించాడంటూ ప్రచారం జరిగింది. 2020-21లో ఆస్ట్రేలియాలో ఒక సవాలుతో కూడిన పర్యటనగా మారింది. ఫిట్‌నెస్, ఫామ్‌తో అతని కష్టాలు అతనిని భారత జట్టు నుండి మినహాయించటానికి దారితీశాయి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం