AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఇలాంటి విధ్వంసం ఎక్కడా చూడలేదయ్యా.. ఈ టీమిండియా బ్యాటర్ ఎవరంటే?

Indian Cricket News: క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్‌కైనా ఒకే ఇన్నింగ్స్‌లో 500లకుపైగా పరుగులు సాధించడం అనేది ఊహకు సైతం అందని అసాధ్యమైన విషయం. కానీ, ఒక భారత యువ క్రీడాకారుడు ఈ అరుదైన ఘనతను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి, కేవలం 330 బంతుల్లోనే అజేయంగా 546 పరుగులు చేసి మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.

85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఇలాంటి విధ్వంసం ఎక్కడా చూడలేదయ్యా.. ఈ టీమిండియా బ్యాటర్ ఎవరంటే?
Indian Cricket News
Venkata Chari
|

Updated on: Apr 20, 2026 | 2:44 PM

Share

Indian Cricket News: క్రికెట్ అనూహ్యమైన మలుపులకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇలాంటి అద్భుతాన్నే భారత యువ ఆటగాడు పృథ్వీ షా ఆవిష్కరించాడు. 2013వ సంవత్సరంలో ముంబైలోని ప్రతిష్టాత్మక ఆజాద్ మైదానంలో జరిగిన హారిస్ షీల్డ్ పోటీల్లో షా ఈ అద్వితీయమైన రికార్డును నెలకొల్పాడు. అప్పట్లో అతని వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. దాదాపు ఆరు గంటల పాటు క్రీజులో పాతుకుపోయిన పృథ్వీ షా ఒకే ఇన్నింగ్స్‌లో 330 బంతులను ఎదుర్కొని 546 పరుగులు చేసి క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఈ చారిత్రాత్మక ప్రదర్శనలో ఏకంగా 85 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.

బెంబేలెత్తిన ప్రత్యర్థి బౌలర్లు..

రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ ఉన్నత పాఠశాల తరపున ఆడుతూ, సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల జట్టుపై పృథ్వీ షా ఈ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అతని దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షా ఆడిన ఈ ఒంటరి పోరాటంతో రిజ్వీ పాఠశాల జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 115.4 ఓవర్లలో ఏకంగా 991 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి బదులుగా బరిలోకి దిగిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులకు, రెండవ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో రిజ్వీ పాఠశాల జట్టు ఏకంగా ఒక ఇన్నింగ్స్ 759 పరుగుల భారీ తేడాతో అఖండ విజయం సాధించింది.

ప్రస్తుతం కనుమరుగైన ప్రతిభ..

అంతటి ఘన చరిత్ర సృష్టించిన పృథ్వీ షా ఇప్పుడు క్రీడా రంగంలో తనదైన ముద్ర వేయలేక కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని విరార్‌లో జన్మించిన షా తల్లిదండ్రులు బీహార్‌లోని గయ నుంచి వలస వచ్చారు. తన నాయకత్వంలో 2018లో పంతొమ్మిదేళ్లలోపు ప్రపంచ కప్‌ను భారత జట్టుకు అందించిన తర్వాత, అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. భారత జట్టు తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 339 పరుగులు (ఒక శతకం), ఆరు వన్డేల్లో 189 పరుగులు చేశాడు. ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఐపీఎల్ లో 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు సాధించాడు. చివరగా 2021 శ్రీలంక పర్యటనలో కనిపించిన ఈ అద్భుత క్రీడాకారుడు, ప్రస్తుతం జాతీయ జట్టులో అన్ని ఫార్మాట్ల నుంచి తన స్థానాన్ని కోల్పోయి అవకాశాల కోసం నిరీక్షిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us