AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్ కట్.. హెచ్‌సీఏకు షాకిచ్చిన విద్యుత్ అధికారులు.. అసలేమైందంటే?

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో చీకల్లు అలముకున్నాయి. విద్యుత్ బిల్లులు బాకీపడడంతో హెచ్‌సీఏకు( హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం) విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్ కట్.. హెచ్‌సీఏకు షాకిచ్చిన విద్యుత్ అధికారులు.. అసలేమైందంటే?
Uppal Cricket Stadium
Venkata Chari
|

Updated on: Dec 15, 2021 | 11:13 AM

Share

Rajiv Gandhi International Cricket Stadium, Uppal:ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో చీకల్లు అలముకున్నాయి. విద్యుత్ బిల్లులు బాకీపడడంతో హెచ్‌సీఏకు( హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం) విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.3 కోట్లకు పైగా కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఈమేరకు ఉప్పల్ స్టేడియంలో కరెంట్ సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హెచ్‌సీఏ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, అలాగే విద్యుత్‌ను యధావిధిగా వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

హెచ్‌సీఏపై గతంలోనూ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈవిషయంపై హెచ్‌సీఏ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తీర్పు విద్యుత్తు శాఖకు అనుకూలంగా రావడంతో హెచ్‌సీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: Virat Kohli: మొదటిసారి మీడియా ముందుకు కోహ్లీ.. కెప్టెన్నీ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేనా.. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలిచ్చేనా?

Rohit Sharma-Virat Kohli: వారిద్దరే సమాధానమివ్వాలి.. అప్పటి వరకు ఈ వివాదంలో తలదూర్చొద్దు: భారత మాజీ సారథి