IPL 2024: చెన్నైలోనూ ‘ కోహ్లీ’ నామజపమే.. ఆర్సీబీ టీమ్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌.. వీడియో చూశారా?

బెంగళూరులో గ్రాండ్‌గా అన్‌బాక్సింగ్ ఈవెంట్‌ను నిర్వహించిన RCB జట్టు ఇప్పుడు తన మొదటి IPL మ్యాచ్ కోసం చెన్నైకి చేరుకుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ సహా జట్టులోని ఆటగాళ్లందరూ చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై చేరుకున్నారు. మార్చి 22న చెన్నైలో ఆతిథ్య సిఎస్‌కెతో ఆర్‌సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది.

IPL 2024: చెన్నైలోనూ  కోహ్లీ నామజపమే.. ఆర్సీబీ టీమ్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌.. వీడియో చూశారా?
Royal Challengers Bengaluru

Updated on: Mar 20, 2024 | 2:57 PM

బెంగళూరులో గ్రాండ్‌గా అన్‌బాక్సింగ్ ఈవెంట్‌ను నిర్వహించిన RCB జట్టు ఇప్పుడు తన మొదటి IPL మ్యాచ్ కోసం చెన్నైకి చేరుకుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ సహా జట్టులోని ఆటగాళ్లందరూ చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నై చేరుకున్నారు. మార్చి 22న చెన్నైలో ఆతిథ్య సిఎస్‌కెతో ఆర్‌సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టీ20 లీగ్‌ 17వ ఎడిషన్‌లో ఇదే తొలి మ్యాచ్‌. కాబట్టి లీగ్‌ను విజయంతో ప్రారంభించడమే ఇరు జట్ల లక్ష్యం. అందుకే ఇరు జట్లూ ఇప్పటికే కఠోర సన్నద్ధమై ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిచి ధనాధన్ టోర్నీలో శుభారంభం పలకాలనుకుంటున్నాయి. కాగా చెన్నై చేరుకున్న ఆర్సీబీ జట్టుకు ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం లభించింది. ముఖ్యంగా ఇక్కడ కూడా కోహ్లీ నామ జపమే వినిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడీ ఆనందాన్ని డబుల్ చేస్తానంటున్నాడు కింగ్ కోహ్లీ. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశాడీ రన్ మెషిన్. ‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచి అభిమానులకు ఆర్‌సీబీ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు మనం కూడా ట్రోఫీని గెలుచుకుని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాం’ అని అన్ బాక్సింగ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మరి కింగ్ కల ఈసారైనా సాకారమవుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

చెన్నై ఎయిర్ పోర్టులో ఆర్సీబీ ఆటగాళ్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

 

ఆర్సీబీ అన్ బాక్సింగ్ ఈవెంట్ లో స్మృతి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..