IPL 2026 : జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్..ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్ట్ రద్దు

IPL 2026 : జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్ (KKR)లో చేరడంపై పీసీబీ ఆగ్రహంగా ఉంది. ఒప్పంద ఉల్లంఘన కింద అతడిపై నిషేధం విధించే అవకాశం ఉంది.కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు అతడిపై భారీ జరిమానాతో పాటు నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

IPL 2026 : జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్..ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్ట్ రద్దు
Pcb Fuming Blessing Muzarabani

Updated on: Mar 14, 2026 | 12:01 PM

IPL 2026 : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ ఊహించని షాకిచ్చాడు. పీఎస్ఎల్ కాంట్రాక్టును రద్దు చేసుకుని, ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2026)లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముజరబానీ తీసుకున్న ఈ నిర్ణయంపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు అతడిపై భారీ జరిమానాతో పాటు నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. ముజరబానీని పీఎస్ఎల్ జట్టు ఇస్లామాబాద్ యునైటెడ్ షమర్ జోసెఫ్ స్థానంలో తమ స్క్వాడ్‌లోకి తీసుకుంది. కానీ, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో ముజరబానీ అద్భుత ప్రదర్శన చేశాడు. 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 13 వికెట్లు తీసి, అందులో ఆస్ట్రేలియాపై 4 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఫామ్‌ను చూసి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీ అతడిని తమ జట్టులోకి ఆహ్వానించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజరబానీని కేకేఆర్ ఎంపిక చేయడంతో, అతను పీఎస్ఎల్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు.

ముజరబానీ ఇలా మధ్యలోనే హ్యాండివ్వడం పీసీబీకి మింగుడుపడటం లేదు. గతేడాది కూడా కార్బిన్ బాష్ అనే ఆటగాడు పీఎస్ఎల్ వదిలేసి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో, అతడిపై ఒక సీజన్ నిషేధం విధించారు. ఇప్పుడు ముజరబానీపై కూడా అదే తరహా చర్యలు తీసుకోవాలని పీసీబీ భావిస్తోంది. అతడిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, ముజరబానీ భవిష్యత్తులో పీఎస్ఎల్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం పుష్కలంగా ఉంది.

ముజరబానీ కెరీర్ చూస్తే.. 6 అడుగుల 8 అంగుళాల పొడవున్న ఈ పేసర్ తన బౌన్స్‌తో బ్యాటర్లను భయపెట్టగలడు. ఇప్పటివరకు 89 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 106 వికెట్లు తీశాడు. గతేడాది ఆర్సీబీ జట్టులో ఉన్నప్పటికీ అతడికి ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి కేకేఆర్ తరుపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసేందుకు ముజరబానీ ఆసక్తిగా ఉన్నాడు. ఒకవైపు పీసీబీ ఆగ్రహం, మరోవైపు ఐపీఎల్ క్రేజ్.. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us