Pakistan Cricket Board: తూచ్.. అవన్నీ వదంతులే అతడే మా హెడ్ కోచ్..

|

Nov 18, 2024 | 10:39 AM

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) టెస్ట్ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీపై వచ్చిన పుకార్లను ఖండించింది, ఆయన దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్‌లకు కోచ్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. గతంలో గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామాతో గిల్లెస్పీ నియమితుడయ్యారు, మరోవైపు PCB విధానాలపై కిర్‌స్టెన్ విభేదాలు తలెత్తాయి. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో కీలక సిరీస్‌లు ఆడనుంది.

Pakistan Cricket Board: తూచ్.. అవన్నీ వదంతులే అతడే మా హెడ్ కోచ్..
Jason Gillespie As Head Coach
Follow us on

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) టెస్ట్ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ పై వచ్చిన పుకార్లపై ఆ దేశ బోర్డు స్పష్టతనిచ్చింది. గిల్లెస్పీ తన పదవిలో కొనసాగుతారని, దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా ఉంటారని PCB స్పష్టం చేసింది. కొన్ని మీడియా కథనాలు గిల్లెస్పీని టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించి, మాజీ పేసర్ ఆకిబ్ జావేద్‌ను ఆ స్థానానికి తీసుకొచ్చినట్లు వెల్లడించాయి. ఈ వార్తలపై PCB తీవ్రంగా స్పందించింది.

“గతంలో ప్రకటించినట్లుగా, జాసన్ గిల్లెస్పీ దక్షిణాఫ్రికాతో రెండు రెడ్ బాల్ టెస్ట్‌లకు పాక్ జట్టుకు కోచ్‌గా కొనసాగుతారు” అని స్పష్టం చేసింది. జాసన్ గిల్లెస్పీ వైట్-బాల్ జట్టుకు అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నెల ప్రారంభంలో ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేయడంతో పాకిస్తాన్ హెడ్ కోచ్ పదవి ఖాళీ అయింది. దీంతో వెంటనే  PCB ఆసీస్ మాజీ పేస్ బౌలర్ జాసన్ గిల్లెస్సీని నియమించింది.

PCB విధానాలతో విభేదాలు: కిర్‌స్టెన్ తన కాంట్రాక్ట్‌లో పేర్కొన్న విధంగా పాకిస్తాన్‌లో ఎక్కువకాలం ఉండటానికి ఇష్టపడలేదు. కాంట్రాక్ట్ ప్రకారం 11 నెలల సర్వీసు అవసరమని PCB పేర్కొన్నప్పటికీ, కిర్‌స్టెన్ అది ఫాలోకాలేదు.

పాకిస్తాన్ జట్టుకు వచ్చే నెలల్లో కీలకమైన సిరీస్‌లు ఉన్నాయి. అవి జింబాబ్వేతో నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు మూడు ODIలు, T20Iలు. డిసెంబర్ 10 నుండి జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాతో ఆల్-ఫార్మాట్ సిరీస్ లు అయిన మూడు T20Iలు, మూడు ODIలు, రెండు టెస్టులు.

గిల్లెస్పీపై వచ్చిన వదంతులను ఖండిస్తూ, ఆయన తన కోచ్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది PCB. కోచింగ్ వ్యవస్థలో జరిగిన మార్పులు, కిర్‌స్టెన్ రాజీనామా వంటి పరిణామాలు ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.