PBKS IPL 2023 Auction: కెప్టెన్‌గా గబ్బర్.. పేపర్ మీద స్ట్రాంగ్.. మైదానంలో సోసో.. ఈసారైనా టాప్ 4 చేరుతుందా?

ఐపీఎల్ సీజన్ ఏదైనా కూడా సోసోగానే ఆడుతుంది పంజాబ్ కింగ్స్. టోర్నమెంట్ చివరికి ఎప్పుడూ ఐదు లేదా ఆరో స్థానంతో సరిపెట్టుకుంటుంది.

PBKS IPL 2023 Auction: కెప్టెన్‌గా గబ్బర్.. పేపర్ మీద స్ట్రాంగ్.. మైదానంలో సోసో.. ఈసారైనా టాప్ 4 చేరుతుందా?
Punjab Kings
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 22, 2022 | 8:57 PM

Punjab Kings IPL 2023 Auction: ఐపీఎల్ సీజన్ ఏదైనా కూడా సోసోగానే ఆడుతుంది పంజాబ్ కింగ్స్. టోర్నమెంట్ చివరికి ఎప్పుడూ ఐదు లేదా ఆరో స్థానంతో సరిపెట్టుకుంటుంది. నాడు కెఎల్ రాహుల్ సారధ్యంలో దురదృష్టం ఈ టీంని వెంటాడగా.. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో మినీ వేలానికి ముందుగా పంజాబ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. సారధ్య బాధ్యతలను టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు అప్పగించడమే కాకుండా.. పలువురు పేరున్న ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్‌ను వదులుకుంది. దీంతో అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ విభాగాల్లో తమ జట్టును బలోపేతం చేసే దిశగా వేలంలోకి అడుగుపెడుతోంది.

పంజాబ్ కింగ్స్ రిటైన్ ఆటగాళ్ల బ్రేక్‌డౌన్ ఇలా..

  • టాప్ ఆర్డర్ బ్యాటర్లు: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్సే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్

  • ఫినిషర్స్: లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్

  • ఆల్‌రౌండర్లు: అథర్వ తైడే, రాజ్ బావా, రిషి ధావన్

  • స్పిన్నర్లు: రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్

  • ఫాస్ట్ బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ ధండా, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్

  • *రిలీజ్ ప్లేయర్స్*: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్ని హొవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, చట్టర్జీ

  • *మిగిలిన మొత్తం*: రూ 32.2 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* – 3, *మొత్తం స్లాట్స్* – 9

ప్రధాన సమస్యలు ఇవే:

– ఈ జట్టుకు షారుఖ్ ఖాన్‌ గత కొంతకాలంగా మంచి ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ.. అతడి స్థానంలో ఓ బ్యాకప్ అవసరం. ఈ సీజన్‌లో జితీష్ శర్మ రెండు లేదా మూడు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించినా.. అవి సరిపోవు ఓవర్సీస్ స్లాట్‌లో ఈ ప్లేస్ భర్తీ చేయాలనీ పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది.

– డొమెస్టిక్ సీమర్స్ బ్యాకప్ ఈ జట్టుకు ఉంది. కానీ అనుభవం ఉన్న ఇండియన్ పేసర్ అవసరం. కచ్చితంగా దీనికి పంజాబ్ టార్గెట్ చేయొచ్చు.

– ఇక ఫినిషింగ్‌లో ఎప్పుడూ లివింగ్‌స్టన్‌పై ఆధారపడిన పంజాబ్.. వేలంలో విదేశీ ఆల్‌రౌండర్‌పై గురి పెట్టొచ్చు.

టార్గెట్ ప్లేయర్స్: సందీప్ శర్మ, ఇషాంత్ శర్మ, శివమ్ మావి, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, సికందర్ రాజా, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్, విరాట్ సింగ్, కెఎస్ భరత్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్