Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS IPL Auction 2024: భారీ యాక్షన్ ప్లాన్‌తో వేలంలోకి పంజాబ్ కింగ్స్‌.. ఈ సారైనా ఆ లోటు పూడేనా?

Punjab Kings IPL 2024 Mini Auction in Telugu: ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.10 కోట్లు మిగిలాయి. ఈ వేలానికి ముందు వారు 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. కేవలం ఐదుగురు ఖరీదైన ఆటగాళ్లను మాత్రమే విడుదల చేశారు.

PBKS IPL Auction 2024: భారీ యాక్షన్ ప్లాన్‌తో వేలంలోకి పంజాబ్ కింగ్స్‌.. ఈ సారైనా ఆ లోటు పూడేనా?
Punjab Kings Ipl 2024
Follow us
Venkata Chari

|

Updated on: Dec 18, 2023 | 12:10 PM

Punjab Kings: గత ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ రికార్డు ధర రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కారణంగా సామ్ కరాన్ IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. అయితే, IPL 2023లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. అందుకే ఈ సంవత్సరం వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ అతనిని విడుదల చేసింది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది మరో ఖరీదైన భారత ఆటగాడు షారుక్ ఖాన్‌ను కూడా విడుదల చేసింది. మరి ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి.

వేలంలో పంజాబ్ వ్యూహం ఏమిటి?

ఐపీఎల్ 2024 కోసం డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.10 కోట్లు మిగిలాయి. ఈ వేలానికి ముందు వారు 17 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు. కేవలం ఐదుగురు ఖరీదైన ఆటగాళ్లను మాత్రమే విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద మొత్తం 8 స్లాట్‌లు మిగిలి ఉన్నాయి. అందులో విదేశీ స్లాట్‌ల సంఖ్య కేవలం 2 మాత్రమే.

స్పిన్నర్లపైనే పంజాబ్ కింగ్స్ చూపు..

పంజాబ్ కింగ్స్ జట్టు తమ జట్టులో విదేశీ స్పిన్నర్‌ను చేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రౌన్ రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్ల రూపంలో స్పిన్ ఎంపికలు ఉన్నాయి. కానీ, వారిద్దరూ చాలా ఎక్కువ ఎకానమీ రేట్లు కలిగి ఉండడంతో, పంజాబ్ కింగ్స్ అయోమయంలో పడింది. ఈ క్రమంలో తక్కువ ఎకానమీ రేట్ కలిగిన మంచి స్పిన్ బౌలర్ కోసం ఆ జట్టు చూస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ రషీద్, న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర లేదా శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా వంటి ఆటగాళ్లను దక్కించుకునేందుకు పంజాబ్ జట్టు ఎదురుచూస్తోంది.

శామ్ కరాన్ స్థానంలో మరో స్పిన్నర్ కోసం..

ఈ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు అత్యంత ఖరీదైన, స్టార్ ఆల్ రౌండర్ శామ్ కరాన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టుకు ఆల్‌రౌండర్ అవసరం తప్పనిసరి. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ లేదా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్‌లను దక్కించుకునే అవకాశం ఉంది.

శార్దూల్ ఠాకూర్ వైపు చూపు?

పంజాబ్ కింగ్స్ జట్టు షారుక్ ఖాన్‌ను విడుదల చేసింది. దీంతో పంజాబ్ జట్టుకు ఫినిషర్ తప్పక అవసరం అవుతుంది. ఈ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్ ఎంపిక కోసం చూసే అవకాశాలు ఉన్నాయి.

రిటైన్ చేసిన ఆటగాళ్లు: శిఖర్ ధావన్, జితేష్ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ భాటియా, అథర్వ టిడ్, రిషి ధావన్, సామ్ కర్రాన్, అలెగ్జాండర్ రజా, శివమ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, విద్వాత్ కవేరప్ప.

రిలీజ్ చేసిన ఆటగాళ్లు: షారుక్ ఖాన్, రాజ్ బావా, బల్తేజ్ ధండా, మోహిత్ రాఠి, భానుక రాజపక్స.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..