T20 World Cup 2021: సెమీ-ఫైనల్ ఓటమి ఎఫెక్ట్? దుబాయ్‌ని వీడినా పాకిస్తాన్ చేరని ఆటగాళ్లు.. మరి ఎక్కడికి వెళ్లారో తెలుసా?
Pakistan Vs Bangladesh: టీ20 ప్రపంచకప్ టోర్నీలో తమ ప్రయాణం ఆగిపోవడంతో పాకిస్థాన్ జట్టు తిరుగుముఖం పట్టింది. కానీ, వారు ఆ విమానంలో పాకిస్తాన్ మాత్రం వెళ్లలేదు.

T20 World Cup 2021, AUS vs PAK: టీ20 ప్రపంచకప్ 2021 సెమీ ఫైనల్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దుబాయ్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీలో ప్రయాణం ఆగిపోవడంతో పాక్ జట్టు తట్టా బుట్టా సర్దుకుని విమానం ఎక్కింది. కానీ, వారు ఆ విమానంలో పాకిస్తాన్‌కు మాత్రం చేరలేదు. వీరంతా ఢాకా చేరుకున్నారు. అయితే బాబర్ అజామ్ సేన సెమీ-ఫైనల్ ఓటమితో స్వదేశంలో జరిగే గొడవల వల్ల పాకిస్తాన్ వెళ్లలేక కాదు.. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం వారు ఢాకా చేరుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పర్యటన నవంబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది.
పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన కోసం 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఇందులో 17 మంది టీ20 ప్రపంచ కప్ 2021లో జట్టులో భాగమయ్యారు. బంగ్లా పర్యటన కోసం ప్రత్యేకంగా ఇఫ్తికార్‌ను జట్టులోకి తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలో ఓటమిని ఎదుర్కోని ఏకైక జట్టు పాకిస్థాన్ మాత్రమే. ఇది సెమీ-ఫైనల్స్‌లో మాత్రం ఓటమిపాలై తిరుగుముఖం పట్టింది. ఆస్ట్రేలియాపై ఓటమి దాని ప్రయత్నాలన్నింటినీ నాశనం చేసింది.
బంగ్లాదేశ్ షెడ్యూల్.. బంగ్లాదేశ్ టూర్‌లో పాక్ జట్టు మూడు టీ20లు, 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్‌తో టూర్ ప్రారంభం కానుంది. నవంబర్ 19, నవంబర్ 20, 22 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఢాకాలో జరుగుతాయి. టీ20 సిరీస్ తర్వాత నవంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు నవంబర్ 26 నుంచి 30 వరకు చిట్టగాంగ్‌లో జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి 8 వరకు ఢాకాలో జరగనుంది.
పాకిస్థాన్ జట్టు దుబాయ్ నుంచి ఢాకా.. పీసీబీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పాకిస్థాన్ జట్టు దుబాయ్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం అందించింది. విమానాశ్రయంలోని ఆటగాళ్ల ఫొటోలను పంచుకుంటూ, దుబాయ్ నుంచి ఢాకాకు ఆటగాళ్ల బయలుదేరారు అంటూ చెప్పుకొచ్చింది.
2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన తీరుతో ఆడితే బంగ్లాదేశ్‌లో సిరీస్ గెలవడం కష్టమేమీ కాదు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఐసీసీ టోర్నీలోనే గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే స్వదేశంలో మాత్రం ఆ జట్టు పులిలా విశ్వరూపం చూపిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.
Pakistan team departs from Dubai to Dhaka for three T20I and two Test match series against Bangladesh which begins on 19 November.#BANvPAK | #HarHaalMainCricket pic.twitter.com/0lJqAHFYie
— Pakistan Cricket (@TheRealPCB) November 12, 2021
Also Read: T20 World Cup 2021: ‘గేమ్ ఛేంజింగ్’ క్యాచ్‌కు పాక్ ఆటగాడు బలి.. నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్..!
T20 World Cup 2021: అతనికి యార్కర్ బౌలింగ్ చేసే జ్ఞానం లేదు.. కాబోయే అల్లుడే ఓటమికి కారణం..




