T20 World Cup 2021: అతనికి యార్కర్ బౌలింగ్ చేసే జ్ఞానం లేదు.. కాబోయే అల్లుడే ఓటమికి కారణం..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోవడం లేదు. భారత్, న్యూజిలాండ్ వంటి జట్లను ఏకపక్షంగా ఓడించిన పాక్ జట్టును ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్ తర్వాత, పాక్ అభిమానులు హసన్ అలీని ట్రోల్ చేశారు...

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోవడం లేదు. భారత్, న్యూజిలాండ్ వంటి జట్లను ఏకపక్షంగా ఓడించిన పాక్ జట్టును ఆస్ట్రేలియా ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్ తర్వాత, పాక్ అభిమానులు హసన్ అలీని ట్రోల్ చేశారు. అతను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ ముఖ్యమైన క్యాచ్‌ను వదిలేశాడు. అయితే ఈ ఓటమికి పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ హసన్ అలీని కాకుండా అతని అల్లుడు షాహీన్ అఫ్రిదీని తప్పుపట్టాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పటిష్ట స్థితిలో నిలిచింది.100 పరుగులలోపే ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయింది. అయితే, దీని తర్వాత మాథ్యూ వేడ్ అద్భుత బ్యాటింగ్ పాక్ చేతిలో విజయాన్ని లాగేసుకుంది. మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్‌లో వేడ్ క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయగా, తర్వాతి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు వేడ్.
హసన్ అలీ క్యాచ్‌ను జారవిడుచుకోవడం వల్ల పాకిస్తాన్ ఓడిపోలేదని, ఈ ఓటమికి కాబోయే అల్లుడు షాహీన్ అఫ్రిది పేలవమైన బౌలింగ్ కారణమని షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు.” నేను షాహీన్ బౌలింగ్‌తో సంతోషంగా లేను. హసన్ అలీ ఒక క్యాచ్‌ను జారవిడుచుకున్నంత మాత్రాన వరుసగా 3 సిక్సర్లు ఎలా కొట్టాడు. షాహీన్‌కు చాలా పేస్ ఉంది. బయట యార్కర్లు వేయగలగాలి” అని అన్నాడు. షాహిద్ అఫ్రిది తన కుమార్తె అక్షకు షాహీన్‌తో సంబంధాన్ని ఫిక్స్ చేశాడు. అఫ్రిదీకి ఐదుగురు కుమార్తెలు. అక్ష వయస్సు 20 సంవత్సరాలు. ఆమె టీ20 ప్రపంచ కప్‌లో తన తండ్రితో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తూ స్టేడియంలో కనిపించింది.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను అవుట్ చేయడం ద్వారా షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై షాహీన్ మూడు వికెట్లు తీయగా, ప్రపంచకప్‌లో తొలిసారి పాకిస్తాన్ భారత్‌పై విజయం సాధించింది. సూపర్ 12లో షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కానీ సెమీ-ఫైనల్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చి అభిమానులకు శత్రువుగా మారాడు.
Read Also..