IND vs PAK: భారత్‌తో ఆడాలంటే మావాళ్లకు భయం.. మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ మాజీ షాకింగ్ కామెంట్స్..
IND vs PAK, ODI World Cup 2023: క్రికెట్ ప్రపంచమంతా వేచిచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి మూడు రోజుల సమయం కూడా లేని తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో ఆడాలంటే పాకిస్తాన్ ప్లేయర్లు వణికిపోతున్నారని, అందుకే కెప్టెన్ బాబర్ అజామ్‌కి సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని తన కామెంట్స్‌తో అందరికీ ఆశ్చర్యం..

India vs Pakistan: క్రికెట్ ప్రపంచమంతా వేచిచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి మూడు రోజుల సమయం కూడా లేని తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో ఆడాలంటే పాకిస్తాన్ ప్లేయర్లు వణికిపోతున్నారని, అందుకే కెప్టెన్ బాబర్ అజామ్‌కి సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని తన కామెంట్స్‌తో అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 14న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. మల్టీ నేషనల్ క్రికెట్ టోర్నీలో మెయిన్ అట్రాక్షన్ అయిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్న వేళ మొయిన్ ఖాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ మాట్లాడుతూ ‘మైదానంలో పాకిస్తానీ ప్లేయర్లు భయపడడాన్ని నేను 100 శాతం చూశాడు. మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదీ, షదాబ్ ఖాన్ వంటి ప్లేయర్లు కూడా భయపడుతూ.. బాబర్ అజామ్‌కి సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించలేకపోయారు. వారంతా ఒక జట్టుగా కాకుండా ఎవరికీ వారే అన్నట్లుగా ఆడుతున్నారు. మైదానంలో వారు చర్చించుకోవడం లేదు, చర్చించుకున్నా దాన్ని అనుసరించడంలేదు. ముఖ్యంగా భారత్‌తో ఆడాలంటే మావాళ్లకు ఎక్కడ లేని భయం పుడుతోంది. ఎవరైతే అలా భయపడతారో వారి సలహాలు ఫలించవు. ఓ క్రికెటర్‌గా మీ సామర్థ్యానికి తగ్గట్లుగా ఉత్తమ ప్రదర్శన కనబర్చాలి. అన్ని సమయాల్లో మీరు ఇచ్చే సలహాలు పని చేయకపోవచ్చు. ఆటలో అది సహజమే’ అన్నాడు.
The players looked scattered, they were hesitant to even give suggestions to Babar Azam: Moin Khan
The comments came as a reaction after Pakistan lost warm-up game against New Zealand pic.twitter.com/uYl5TWdYpq
— Mufaddal Vohra (@Mufadddal_Vohra) October 2, 2023
కాగా, వన్డే వరల్డ్ కప్ వేదికగా భారత్‌తో మొత్తం 7 సార్లు ఆడిన పాకిస్తాన్ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో అయితే భారత్ 356 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 128 పరుగులకే కుప్పకూలి 228 రన్స్ తేడాతో ఓడిపోయింది.
ఇదిలా ఉండగా.. భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే మన దేశానికి విచ్చేసిన పాకిస్తాన్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. అందులో పాక్ వికెట్ కీపర్ భారత గడ్డపై తన తొలి సెంచరీ(వార్మప్ మ్యాచ్ లెక్కలు అనధికారికమే) నమోదు చేసినా, బౌలర్లు దారుణంగా విఫలమవడంతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక తన రెండో, చివరి వార్మప్ మ్యాచ్‌ని నేడు అస్ట్రేలియాతో ఆడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




