Champions Trophy: బీసీసీఐకి షాక్ ఇచ్చిన పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రాకపోతే.. బెదిరింపులు షురూ చేసిన పీసీబీ

|

Jul 15, 2024 | 7:33 PM

Champions Trophy 2025: ఒకవేళ భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోతే, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించవచ్చు. అయితే, మొత్తం టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే తన వైఖరి నుంచి పీసీబీ వెనక్కి తగ్గదు. ఈ వారం శ్రీలంకలో జరిగే ఐసీసీ సమావేశంలో బోర్డు అదే స్టాండ్‌లో ఉంటుంది.

Champions Trophy: బీసీసీఐకి షాక్ ఇచ్చిన పాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రాకపోతే.. బెదిరింపులు షురూ చేసిన పీసీబీ
India Vs Pakistan
Follow us on

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్‌లో నిర్వహించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ఆతిథ్యం పాకిస్థాన్‌కు దక్కినందున, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అన్నది అతిపెద్ద సమస్యగా మారింది. అయితే దౌత్యపరమైన కారణాలతో భారత జట్టు ప్రయాణించే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ సంబంధాల కారణంగా పాకిస్థాన్‌కు వెళ్లకపోవచ్చని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వం మాత్రమే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

ఒకవేళ భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోతే, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించవచ్చు. అయితే, మొత్తం టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే తన వైఖరి నుంచి పీసీబీ వెనక్కి తగ్గదు. ఈ వారం శ్రీలంకలో జరిగే ఐసీసీ సమావేశంలో బోర్డు అదే స్టాండ్‌లో ఉంటుంది.

టీ20 ప్రపంచకప్ బహిష్కరించనున్న పాక్..

ఐసీసీ బోర్డు సమావేశం జులై 19 నుంచి 22 వరకు జరగనుంది. కొలంబోలో జరిగే ఈ సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పాల్గొనవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోతే, 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని కూడా నివేదిక పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది.

గతేడాది జరిగిన ఆసియా కప్‌కు కూడా భారత్‌ పాకిస్థాన్‌ వెళ్లేందుకు నిరాకరించింది. దీని తరువాత, పీసీబీ ఆసియా కప్‌ను ‘హైబ్రిడ్ మోడల్’ కింద నిర్వహించవలసి వచ్చింది. ఇప్పుడు ఆసియా కప్ 2023 లాగా ఈ టోర్నీని కూడా ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించాల్సి వస్తుందని పాకిస్థాన్ భయపడుతోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకకు మార్చవచ్చు.

ICC బోర్డు సమావేశాలలో, ప్రతి సభ్యుడు ఓటింగ్ వేసి తమ సమస్యను లేవనెత్తవచ్చు. అయితే సభ్య దేశ ప్రభుత్వం అక్కడ ఆడలేమని చెబితే ఐసీసీ ప్రత్యామ్నాయాలను వెతకాల్సి ఉంటుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను పీసీబీ సిద్ధం చేసి ఐసీసీ, దాని సభ్య దేశాల ఆమోదం కోసం పంపింది. అన్ని చోట్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత విడుదల చేయనున్నారు. అయితే అంతకుముందే ఈ షెడ్యూల్ వైరల్‌గా మారింది. దీని ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న కరాచీలో ప్రారంభమవుతుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. అలాగే షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ లను ఒకే గ్రూపులో ఉంచారు. మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. లాహోర్‌లో భారతదేశం అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది.

ఇంత జరిగినా, భారత పర్యటనపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉందని, అయితే ఈ విషయంలో చివరి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని బీసీసీఐ తెలిపింది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా పాక్ టూర్‌లో ఆసియా కప్ ఆడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..